Sai Pallavi: అమర్‌నాథ్ యాత్రలో సాయిపల్లవి, జీవితమే ఓ తీర్థయాత్ర అంటూ ఎమోషనల్!

షూటింగ్స్ నుంచి ఏమాత్రం సమయం దొరికినా సాయిపల్లవి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలుతుంది.

Published By: HashtagU Telugu Desk
Saipallavi

Saipallavi

సాయిపల్లవి మంచి నటి మాత్రమే కాదు.. గొప్ప భక్తురాలు కూడా. షూటింగ్స్ నుంచి ఏమాత్రం సమయం దొరికినా ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలుతుంది. క్రమం తప్పకుండా ధాన్యం చేస్తోంది. జపమాలతో ఒత్తిడిని అధిగమిస్తోంది. అయితే సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన ఈబ్యూటీ అమర్ నాథ్ యాత్రలో కనిపించడంతో అభిమానులు ఫిదా అయ్యారు. సాయి పల్లవి ఇటీవల తన తల్లిదండ్రులతో కలిసి అమర్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, చివరకు ఆమె ఆధ్యాత్మిక అనుభవాన్ని రాసింది.

ప్రేమమ్ ఫేం  తన వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం పెద్దగా ఇష్టం చూపదు. కానీ అమర్‌నాథ్ యాత్ర సాయిపల్లవిలో కొత్త ఉత్సాహం నింపింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ యాత్రకు పేరెంట్స్ తో కలిసి వెళ్లింది. “దాదాపు 60 ఏళ్ల వయస్సు ఉన్న తల్లిదండ్రులను యాత్రను తీసుకువెళ్లడం అనేది వర్ణించలేదని. వారు ఊపిరి పీల్చుకోవడం, మధ్య మధ్యలో ఛాతీని పట్టుకోవడం, మంచు కొండల మధ్య ఇబ్బందులు పడటంతో దేవుడా ఇక్కడే ఎందుకు ఉన్నావ్ అంటూ తనను తాను ప్రశ్నించుకుంది. ఎన్నో ప్రశ్నలు సర్వశక్తిమంతుడైన స్వామిని ప్రశ్నించేలా చేశాయని ఆమె తెలిపింది.

అమర్‌నాథ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రశ్నకు సమాధానం లభించిందని సాయిపల్లవి చెప్పింది. కొండపైకి నడిచినప్పుడు, నేను అఖండమైనదాన్ని చూశాను. భక్తులందరూ “ఓం నమః శివాయ” అని జపిస్తారు.  తక్షణమే అదే యాత్రికులు తిరిగి జపం చేస్తారు. పవిత్ర గుహలో భోలే నాథ్‌ను ఆరాధించాలనే వారు గుర్రాలు, గ్రామస్థులు సాయంతో దేవుడ్ని దర్శించుకుంటున్నారు. అమర్ నాథ్ యాత్ర నాలో గొప్ప ఉత్సాహం నిపింది. జీవితమే  ఓ తీర్థయాత్ర” అని సాయిపల్లవి చెప్పింది.

 

Also Read: Power Politics: ఉచిత విద్యుత్ కు కాదు అవినీతికి కాంగ్రెస్ పార్టీ పేటెంట్: బీఆర్ఎస్ నేతలు

  Last Updated: 15 Jul 2023, 04:31 PM IST