Virupaksha Trailer: ఆసక్తి రేపుతున్న ‘విరూపాక్ష’ ట్రైలర్.. సాయిధరమ్‌ తేజ్‌ హిట్ కొడతాడా!

‘విరూపాక్ష’ ఏప్రిల్‌ 21న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published By: HashtagU Telugu Desk
Virupaksha

Virupaksha

సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) హీరోగా కార్తీక్‌ దండు తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). సంయుక్తా మేనన్‌ కథానాయిక. సంయుక్త (Samyuktha) కథానాయిక. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇవాళ 11న ఉదయం 11.07గంటలకు చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. కాగా ‘విరూపాక్ష’ ఏప్రిల్‌ 21న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హీరో సాయితేజ్ ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మెగా అభిమానులు (Meag Fans) ఆసక్తి కనబరుస్తున్నారు.

ట్రైలర్ (Trailer) చాలా అద్బుతంగా ఉంది. టీజర్ తోనే మంచి స్పందన తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ట్రైలర్ మరింత అంచనాలను పెంచేసింది. ట్రైలర్ లో రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథలా కనిపిస్తుంది. చాలా వివరాలను చెప్పకుండానే ట్రైలర్ ను చాలా ఇంట్రస్టింగ్ గా మలిచారు మేకర్స్. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది ట్రైలర్. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ (Saidharam Tej) గ్రామంలో ఆకస్మికంగా జరిగే మరణాలు వెనక గల కారణాన్ని కనుగొనే అన్వేషణలో ఉన్నట్లు కనిపిస్తోంది.

స్థానికుల మరణాలకు కారణాలు ఏంటి? దీని వెనక ఎవరు ఉన్నారు? వాటిని హీరో ఎలా కనుగొన్నారు వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ట్రైలర్ మొత్తం చాలా ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఈసారి సాయి ధరమ్ తేజ్ (Saidharam Tej) హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ కు బిగ్ రెస్పాన్స్ వస్తుండటంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Biker Video: వాట్ ఏ డ్రైవింగ్ గురూ.. నదిలో బైక్ డ్రైవింగ్, చక్కర్లు కొడుతున్న వీడియో!

  Last Updated: 11 Apr 2023, 03:12 PM IST