Site icon HashtagU Telugu

Kangana Ranaut: సద్గురు ఇండియాకి కాదు భారత్ కి వస్తారు

Kangana Ranaut

New Web Story Copy 2023 09 06t174436.583

Kangana Ranaut: ఇండియాపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. రెండు రోజులుగా ఇండియా పేరును మారుస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఇండియా పేరు మార్చేసి భారత్ గా నామకరణం చేస్తారన్నది ప్రధాన చర్చ. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటు అధికారిక ప్రకటన రానప్పటికీ పలు సందర్భాల్లో కేంద్రం ఇండియాకి బదులుగా భారత్ అంటూ ప్రస్తావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఇండియా ఉండదని భావిస్తున్నారు. అయితే కొందరు కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఇచ్చిన పేరని, మన దేశం భారత్ అని అంటున్నారు. తాజాగా ఇండియా పేరు విషయంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆధ్యాత్మిక గురువు సద్గురు వీడియోను షేర్ చేస్తూ కంగనా తన స్టాండ్‌ను వ్యక్తం చేసింది. దేశాన్ని జయించి పాలించిన శక్తులు పెట్టిన పేరును అంగీకరించడం సరికాదని, అది మన ఉనికికే ప్రశ్నార్థకం అని సద్గురు వీడియోలో చెప్పారు. దీనిపై కంగనా.. మా గురువుగారు దశాబ్దాల క్రితమే చెప్పారు. అతను ఇప్పుడు కైలాస యాత్రలో ఉన్నాడు. ఇండియా పేరు మార్పు గురించి ఈ క్షణం వరకు అతనికి తెలియదు. అతని పునరాగమనం ఇండియాకి కాదు, భారత్‌కు అని కంగనా పేర్కొంది.

G-20 సమ్మిట్ సందర్భంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పిలిచారు. దీంతో దేశంలో పేరు మార్పుపై చర్చ మొదలైంది. దేశం పేరును భారత్‌గా మార్చాలని పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వివాదంలో సినీ, క్రీడా తారలతోపాటు పలువురు స్పందిస్తూ వస్తున్నారు. నటుడు అమితాబ్ బచ్చన్ మరియు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మార్పుకు మద్దతు తెలిపారు. క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్‌ పేరుతో ఆడాలని సెహ్వాగ్ అన్నాడు. నటుడు విష్ణు విశాల్‌తో సహా వ్యక్తులు ఈ అంశంపై ప్రతికూల వైఖరిని ప్రదర్శించారు.

Also Read: Errabelli Dayakar Rao: కేసిఆర్ కు మోసం చేస్తే క‌న్న‌త‌ల్లికి మోసం చేసిన‌ట్లే!