ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా ఈ నెల 27న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా విషయంలో ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబోలో వస్తున్న దేవర రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తారక్ కి జతగా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నాడు.
ఎన్టీఆర్ (NTR) ఈ సినిమాలో డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. దేవర సినిమాలో ఫ్యాన్స్ అందరు కోరుకునే అన్ని కమర్షియలంశాలతో పాటుగా ఎన్ టీ ఆర్ నట విశ్వరూపం తో పూనకాలు తెప్పిస్తారని తెలుస్తుంది. ఇక నేడు సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరుగుతుంది. దేవర ట్రైలర్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
పాన్ వరల్డ్ క్రేజ్ తెచ్చుకున్న తారక్..
RRR తో పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ క్రేజ్ తెచ్చుకున్న తారక్ ఆ నెక్స్ట్ సినిమానే దేవరగా వస్తున్నాడు. అందుకే ఈ సినిమా మీద తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. ఐతే దేవర సినిమా రన్ టైం (Devara Runtime) గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా లెంగ్త్ బాగానే ఉంటుందని.. దేవర రన్ టైం దాదాపు 3 గంటల దాకా ఉంటుందని టాక్.
ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు లెంగ్త్ ఎక్కువ ఉన్నా సరే చూస్తున్నారు. దేవర విషయంలో కూడా అది రిపీట్ చేస్తున్నారు. లెంగ్త్ ఎక్కువ మంచిదే కానీ సినిమా అనుకున్న విధంగా లేకపోతే మాత్రం ఆ లెంగ్తే మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి దేవర టీం ఈ విషయంపై ఎలా ఆలోచిస్తునారన్నది తెలియదు కానీ మేకర్స్ మాత్రం లెంగ్తీ రన్ టైం ఉంటుందనే చెబుతున్నారు.
Also Read : Vijay GOAT : విజయ్ గోట్ ఫ్లాప్ కి కారణం ఆ ఐపిఎల్ టీం అట..!