టాలీవుడ్ బ్యూటీ రుహాని శర్మ (Ruhani Sharma) చేసే పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి కానీ అమ్మడి ఫోటో షూట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటాయి. చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహాని శర్మ విశ్వక్ సేన్ తో హిట్ లో నటించింది. మధ్యలో ఒకటి రెండు సినిమాలు చేసిన అమ్మడు లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ తో కలిసి సైంధవ్ లో కనిపించింది. సినిమాలో ఆమె రోల్ చిన్నదే అయినా ఇంప్రెస్ చేసింది. అయితే చేస్తున్న సినిమాల కన్నా ఫోటో షూట్స్ తో రుహాని శర్మ ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటుంది.
We’re now on WhatsApp : Click to Join
రుహాని ఫోటో షూట్ అంటే చాలు ఫాలోవర్స్ కూడా పిచ్చెక్కిపోయేలా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. లేటెస్ట్ గా అమ్మడు చిలకపచ్చ శారీ లో ఫోటో షూట్ చేసింది. శారీలో కూడా తన సోయగాల వలతో ఫాలోవర్స్ ని డిస్టర్బ్ చేస్తుంది అమ్మడు. తన ఓర చూపులకు ఆడియన్స్ అంతా క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.
సినిమాల్లో ఇచ్చిన పాత్రలతో మెప్పిస్తూ వస్తున్న రుహాని శర్మ ఫోటో షూట్స్ తో మాత్రం నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో చేస్తుంది. అమ్మడు చేస్తున్న ఈ ఫోటో షూట్స్ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. రుహాని లేటెస్ట్ శారీ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : VK Naresh : మహేష్ మీద ఈగ వాలనివ్వను.. బ్రదర్ గా నేనెప్పుడూ తోడుంటా..!
రుహాని చేస్తున్న ఈ గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియా ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి. అయితే టాలెంట్ తో పాటు అందం కూడా ఉన్నా సరె అమ్మడికి సరైన అవకాశాలు రావట్లేదని చెప్పొచ్చు.