Site icon HashtagU Telugu

RRR 100 Days: ‘ఆర్ఆర్ఆర్’ అన్ స్టాపబుల్.. జపాన్ లో తొలి ‘శతదినోత్సవ’ చిత్రంగా రికార్డ్!

RRR

RRR

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసిన నటించిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ పలు విభాగాల్లో ఆస్కార్ రేసులో నిలిచి తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది. ఇక (RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా సీని లవర్స్ హృదయాలను గెలుచుకుంది. నాటు నాటు ఉత్తమ పాటగా ఆస్కార్ నామినేషన్ గెలుచుకోవడంతో పాటు అదే విభాగంలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకోవడంతో కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్ (Japan) థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) జపాన్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఆర్‌ఆర్‌ఆర్‌కు (RRR) జపాన్‌లో విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. 114 సెంటర్లలో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎస్‌ఎస్ రాజమౌళి జపాన్ ప్రేక్షకులకు థ్యాంక్స్ నోట్ రాశారు. “ఆ రోజుల్లో ఒక చిత్రం 100 రోజులు, 175 రోజులు ప్రదర్శింపబడటం చాలా పెద్ద విషయం. కాలక్రమేణా వ్యాపార స్వరూపం మారిపోయింది. ఆ మధురమైన జ్ఞాపకాలు పోయాయి. కానీ జపాన్ అభిమానులు మాత్రం మనలో ఆనందం నింపారు. లవ్ యూ జపాన్… అంటూ ట్విట్టర్ (Twitter) వేదికగా రాజమౌళి రియాక్ట్ అయ్యారు.

“సినిమా విడుదలై మంచి ఆదరణ పొందినప్పుడు సీక్వెల్ (Part2) చేయాలనే ఆలోచనలో పడ్డాం. మాకు కొన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి. కానీ ఫారిన్ కంట్రీస్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని వారాల క్రితం మా నాన్నతో, మా కజిన్‌తో (రచన బృందంలో భాగమైన వారితో) మళ్ళీ చర్చిస్తున్నప్పుడు అద్భుతమైన ఆలోచన వచ్చింది. మేం వెంటనే సినిమా కథను రాయడం ప్రారంభించాం.  స్క్రిప్ట్ పూర్తి అయితేనే ఆర్ఆర్ఆర్2 సినిమా మొదలుపెడుతాం’’ రాజమౌళి (Rajamouli) ఓ సందర్భంలో అన్నారు.

Also Read: Sharat Kumar Met Kavitha: కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ!

Exit mobile version