Thalapathy Vijay : దళపతి విజయ్ తో ఆర్.ఆర్.ఆర్ నిర్మాత..!

Thalapathy Vijay RRR నిర్మాత డివివి దానయ్య ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ఈ సినిమా

Published By: HashtagU Telugu Desk
Tamil Star Director Bharathiraja refused to Introduce Vijay as Hero

Tamil Star Director Bharathiraja refused to Introduce Vijay as Hero

Thalapathy Vijay RRR నిర్మాత డివివి దానయ్య ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న కారణంగా OG షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత కోల్కీవుడ్ స్టార్ దళపతి విజయ్ తో దానయ్య సినిమా ఉంటుందని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

డివివి దానయ్య దళపతి విజయ్ తో సినిమా చేసేలా ఒప్పించారట. ప్రస్తుతం విజయ్ చేస్తున్న గోట్ సినిమా తర్వా దానయ్య సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. కచ్చితంగా స్టార్ డైరెక్టర్ తోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ విజయ్ తెలుగు నిర్మాత దిల్ రాజుతో వారిసు సినిమా చేశాడు. ఆ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది.

విజయ్ దానయ్య డివివి ఈ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. విజయ్ గోట్ పూర్తి కాగానే ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది. అయితే విజయ్ వారిసు లా కాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం విజయ్ హైదరాబాద్ కూడా తెప్పించాలని దానయ్య ప్లాన్.

Also Read : NTR Devara Release Date : దేవర డేట్ పై కన్నేసిన ఆ ఇద్దరు..!

  Last Updated: 24 Jan 2024, 08:11 AM IST