Oscar – RRR: ఆర్ఆర్ఆర్‌కు బిగ్ షాక్.. ఆస్కార్ నామినేషన్స్ లో ఎదురుదెబ్బ!

Oscar - RRR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మోగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమాగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 11:45 PM IST

Oscar – RRR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మోగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమాగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ఇది రిలీజ్ అయింది. అత్యధిక కలెక్షన్లను ఈ సినిమా దక్కించుకుంది బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమా ఎన్టీఆర్, రాంచరణ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ వర్గాలు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ సినిమాలోని ఎన్టీఆర్, రాంచరణ్ యాక్టింగ్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు.

అయితే తాజాగా ఆస్కార్ నామినేషన్స్ లో ఆర్ఆర్ఆర్ కు బిగ్ షాక్ తగిలింది. 2023 ఆస్కార్ నామినేషన్్ లో ఆర్ఆర్ఆర్ కు ఎంట్రీ దక్కలేదు. ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్ సినిమాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ హిట్ అయిన ఈ రెండు సినిమాలు కాకుండా గుజరాతీ సినిమా అయిన ఛెల్లో షా మూవీ ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఆ సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఎంట్రీ దక్కించుకుంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.వెయ్యి కోట్ల కలెక్షన్లను ఆర్ఆర్ఆర్ వసూళ్ల సాధించింది. దీంతో ఈ సినిమా ఆస్కార్ కేసులో ఉంటుందని అందరూ భావించారు. ఇప్పటికే ఆస్కార్ ఉత్తమ నటుడు నామినేషన్స్ లో ఎన్టీఆర్, రాంచరణ్ ఉన్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా నామినేషన్స్ లో ఉంటుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి ఆస్కార్ నామినేషన్స్ లో ఈ సినిమాకు చోటు దక్కకపోవడం సినిమా యూనిట్ ను నిరాశపర్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు కూడా కూడా నిరాశ చెందుతున్నారు. ఇంత మంచి సినిమాకు ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కకపోవడం బాధకరంగా ఉందంటున్నారు.