Roja తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీనియర్ నటీమణుల రీ-ఎంట్రీ ట్రెండ్ నడుస్తోంది. శోభన వంటి నటీమణుల బాటలోనే, ఇప్పుడు మాజీ మంత్రి రోజా కూడా మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ తమిళ సినిమాలకు దూరమైన రోజా… 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమయ్యారు.
Perambur Gaana from #AnbeDianapic.twitter.com/wM3Vk0yqPL
— Timelessvoice (@Timelessvoice81) March 21, 2026
ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైన చిత్రం ‘అన్బే డయానా’. పారి ఎలవళగన్ హీరోగా నటిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రోజా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఆమె హీరో తల్లిగా నటిస్తున్నారు. పెరంబూర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో రోజా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సమాచారం. ఇటీవల విడుదలైన ‘పెరంబూర్ గానా’ సాంగ్‌లో రోజా తన పాత రోజులను గుర్తు చేస్తూ వేసిన మాస్ స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డాన్స్‌లో తన ఎనర్జీని చూపిస్తూ అభిమానులను ఖుషీ చేశారు.
కేవలం ‘అన్బే డయానా’ మాత్రమే కాకుండా, రోజా నటించిన ‘లెనిన్ పాండ్యన్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల రాధికా శరత్‌కుమార్ ‘తాయి కిళవి’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకోవడంతో, రోజా రీ-ఎంట్రీ సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మిలియన్ డాలర్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
