టాలీవుడ్‌లో అగ్రహీరోల సరసన నటించి, బుల్లితెరపై కూడా తనదైన ముద్రవేసిన రోజా.. ఈ మధ్య రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయారు. సినిమాల తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ (Jabardasth) వంటి పాపులర్ షోల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొంతకాలం ఆ షోలో కొనసాగారు. అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆమె కొంతకాలం పబ్లిక్‌గా కనిపించలేదు.
VH Meets CBN : చంద్రబాబు తో వీహెచ్ భేటీ
అయితే తాజాగా రోజా (Roja) మళ్లీ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రముఖ ఛానల్ జీ తెలుగు నిర్వహించే ‘సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ – 4’ (Super Serial Championship Season 4) కార్యక్రమానికి ఆమె హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ షోలో ఆమెతో పాటు ప్రముఖ నటులు శ్రీకాంత్, రాశి జడ్జిలుగా ఉండనున్నారు. ఇటీవల విడుదలైన ప్రోమోలో రోజా తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అలరించారు. ఈ ప్రోమో చూసిన ఆమె అభిమానులు, టీవీ ప్రేక్షకులు రోజా మళ్లీ బుల్లితెరపై కనిపించనున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Mysterious Hair Loss: గోధుమల దెబ్బకు జుట్టు రాలుతోంది.. ఆ జిల్లాలో కలకలం
ఈ షోను మార్చి 2న సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందిన ఈ కార్యక్రమం, టాప్ సీరియల్ నటీనటులను కలిపి వినోదాత్మకంగా సాగనుంది. ముఖ్యంగా రోజా హోస్టింగ్, ఆమె స్టైల్, మజాకులతో షో మరింత ఎంటర్‌టైన్ మెంట్ అందించే అవకాశం ఉంది. రాజకీయాల్లో బిజీ అయినప్పటికీ, ఆమె మళ్లీ బుల్లితెరపై అడుగుపెట్టడం ఆమె అభిమానులకు మళ్లీ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.