Site icon HashtagU Telugu

Roja : అలాంటి పాత్రలైతే చేస్తానంటున్న రోజా..!

Roja Interested To Do Those Type Of Roles

Roja Interested To Do Those Type Of Roles

నిన్నటితరం స్టార్ హీరోయిన్ రోజా ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పొలిటికల్ గా బిజీ బిజీ అయిన ఆమె వెండితెర తో పాతు బుల్లితెరకు దూరమయ్యారు. జబర్దస్త్ (Jabardasth) షో ద్వారా మరింత పాపులారిటీ సంపాఇంచిన రోజా ఆ తర్వాత ఏపీలో కీలక నేతగా మారారు. ఐతే ప్రస్తుతం ఆమె పొలిటికల్ గా ఫ్రీ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిన రోజా ఇప్పుడు తన ఫోకస్ సినిమాల మీదకు షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలో రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో రోజా (Roja) తాను సినిమాల్లో నటించేందుకు సిద్ధమే కానీ కండీషన్స్ అప్లై అనేస్తుంది. సినిమాలో ఇంపార్టెంట్ ఉన్న పాత్ర అయితేనే తాను చేస్తానని అంటుంది రోజా. బాహుబలిలో శివగామి (Shivagami), అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్రల తరహాలో తనకు కావాలని అంటుంది. తనకు అలాంటి పాత్రలు చేయాలని ఉందని. సినిమాలో ముఖ్య పాత్రగా చేసే అలాంటి పాత్రలు చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటుంది రోజా.

రోజా రిక్వెస్ట్ ని మన మేకర్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి. రోజా గోపీచంద్ (Gopichand) తో గోలీమార్, మొగుడు సినిమాలు చేసింది. ఆ సినిమాలు ఫెయిల్ అవ్వడం వల్ల ఆమెకు సరైన పాత్రలు రాలేదు. రోజా రాజకీయంగా కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తుంది. మరి రోజా థర్డ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది. ఆమె ఎలాంటి పాత్రలు చేస్తుంది అన్నది చూడాలి.

Also Read : Actor SubbaRaju: ప్రముఖ నటుడు సుబ్బరాజు ఒక ఇంటివాడు అయ్యాడు…