Site icon HashtagU Telugu

KGF3 Update: రాకీభాయ్ మళ్లీ వస్తున్నాడు.. కేజీఎఫ్3 అప్ డేట్ ఇదిగో!

Kgf3

Kgf3

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ (KGF) సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసి రికార్డులను తిరుగరాసింది. 2022లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. అటు హిందీలో కూడా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలై నేటితో యేడాది పూర్తి చేసుకుంది. సౌత్, నార్త్  అనే తేడా లేకుండా మొత్తం భారతీయ  బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.

ఇప్పటికే  ఈ సినిమా రూ. 1200 కోట్ల గ్రాస్ క్లబ్బులోచేరి కొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బాహుబలి 2  తర్వాత స్థానంలో నిలిచింది. ఇక జపాన్ కలెక్షన్స్ కలుపుకుంటే ఈ సినిమా కలెక్షన్స్‌ (Collections)ను దాటేసింది. అయితే సరిగ్గా ఇవాళ కేజీఎఫ్2 సినిమా విడుదలై ఏడాది కావోస్తోంది.

అయితే హీరో యశ్ ఇతర సినిమాలు ఒప్పుకోకపోవడం, నేటికీ రాకీభాయ్ లుక్ లోనే కనిపిస్తుండటంతో అటు ప్రేక్షకుల్లో, ఇటు సినిమా వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే ఇవాళ కేజీఎఫ్2 మూవీ విడుదలై ఏడాది కావడంతో మేకర్స్ (Producers) అందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ది ప్రామిస్ విల్ కెప్ట్ అంటూ.. కేజీఎఫ్3 వస్తుందంటూ’ చెప్పకనే చెప్పారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ తర్వాత ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్ 3 (KGF-3) ఉండవచ్చునని భావిస్తున్నారు. కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు భారీ హిట్ ను సొంతం చేసుకోవడంతో అందరి కన్ను కేజీఎఫ్-3పై పడింది. హీరో యశ్ కూడా త్వరలో అప్ డేట్ ఉంటుందని చెప్పడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.

Also Read: Salt Effects: ఉప్పు.. ముప్పు, అతిగా వాడితే అంతే మరి!