Site icon HashtagU Telugu

Pushpa 2 : ‘పుష్ప-2’పై మాజీ మంత్రి రోజా ప్రశంసలు

Roja Pushp2

Roja Pushp2

‘పుష్ప-2’ సినిమాపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఐకాన్ స్టార్.. మీ పుష్ప-2 చిత్రం అంచనాలకు మించింది. పుష్పతో తగ్గేదేలే అన్నారు. Pushpa2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు అంటూ ప్రశంసలు కురిపించింది. అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2’ (Pushpa 2)సినిమా భారత సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ వస్తున్నారు. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే పలు రికార్డ్స్ సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 05 న విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి హైప్‌ను సృష్టించింది.

అల్లు అర్జున్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ముగ్ధులను చేస్తున్నాయి. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ వంటి నటుల ఆకట్టుకునే పాత్రలతో పాటు చక్కని సినిమాటోగ్రఫీ కూడా ‘పుష్ప-2’కి ప్లస్ పాయింట్‌గా మారాయి. కాకపోతే పుష్ప తో పోలిస్తే పుష్ప 2 కాస్త తగ్గిందనే చెప్పాలి. కథ ఆ రేంజ్ లో లేకపోయినా అల్లు అర్జున్ యాక్టింగ్ చించేసాడు. దీంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక కలెక్షన్లు కూడా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ను సైతం బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది. ఇదే క్రమంలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు , ముఖ్యంగా వైసీపీ నేతలు పుష్ప 2 పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా నటి , మాజీ మంత్రి రోజా (RK Roja)..పుష్ప 2 పై ప్రశంసలు కురిపించింది.’ఐకాన్ స్టార్.. మీ పుష్ప-2 చిత్రం అంచనాలకు మించింది. పుష్పతో తగ్గేదేలే అన్నారు. Pushpa2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు. మా చిత్తూరు యాస వెండితెరపై పలికిన తీరు హాల్లో ఈలలు వేయిస్తోంది. మీ నటన అద్భుతం, యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్తో పుష్పా అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు’ అని ట్వీట్ చేశారు.

Read Also : Asha Workers : హైద‌రాబాద్‌లో ఆశా వ‌ర్క‌ర్ల‌పై పోలీసుల దాడి