RJ Shekar Basha : రాజ్ తరుణ్ – లావణ్య ఇష్యూలో రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా మాట్లాడి బాగా వైరల్ అయ్యాడు ఆర్జే శేఖర్ బాషా. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో తన కుళ్ళు జోకులతో బాగానే నవ్విస్తున్నాడు. అయితే నేడు రెండో వారం ఎలిమినేట్ కంటెస్టెంట్ శేఖర్ బాషానే అని తెలుస్తుంది.
నిన్నటి ఎపిసోడ్ లో శేఖర్ బాషాకు కొడుకు పుట్టాడని, శేఖర్ బాషా భార్య, బాబు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని నాగార్జున చెప్పారు. దీంతో శేఖర్ బాషా ఎమోషనల్ అయ్యాడు. అయితే రెండో వారం నామినేషన్స్ లో నాగమణికంఠ, కిరాక్ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్ బాషా, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్ ఉండగా వీరిలో అంతగా యాక్టివ్ లేనిది పృథ్వీ కాబట్టి అతన్ని ఎలిమినేట్ చేస్తారని అనుకున్నారు.
కానీ నేడు ఆదివారం ఎపిసోడ్ లో శేఖర్ బాషాని ఎలిమినేట్ చేశారని సమాచారం. శేఖర్ బాషాకు కొడుకు పుట్టడంతో ఈ సమయంలో తన భార్య పక్కన ఉండటానికి శేఖర్ బాషానే వెళ్ళిపోతున్నాడా? లేదా బిగ్ బాస్ వాళ్లే పంపిస్తున్నారా అని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి హౌస్ లో కామెడీ చేసే శేఖర్ బాషాని రెండో వారమే పంపించేస్తునారు.
Also Read : Megha Akash : ఘనంగా హీరోయిన్ మేఘ ఆకాష్ పెళ్లి..