Site icon HashtagU Telugu

Nabha Natesh : ప్రియదర్శి, నభా నటేష్ గొడవలోకి రీతూవర్మ ఎంట్రీ.. ఏంటి మీ పంచాయితీ..

Ritu Varma Entered Into Nabha Natesh Priyadarshi Pulikonda War

Ritu Varma Entered Into Nabha Natesh Priyadarshi Pulikonda War

Nabha Natesh : టాలీవుడ్ యాక్ట్రెస్ నభా నటేష్, ప్రముఖ నటుడు ప్రియదర్శి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది. రీసెంట్ గా నభా నటేష్ ఓ దబ్ స్మాష్ వీడియోని షేర్ చేసారు. ఆ వీడియోలో నభా నటేష్.. ప్రభాస్ వాయిస్ తో డార్లింగ్ అంటూ దబ్ స్మాష్ చేసారు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన ప్రియదర్శి.. “వావ్ సూపర్ డార్లింగ్. కిర్రాక్ ఉన్నావ్ డార్లింగ్” అంటూ కామెంట్ చేసారు.

దీనికి నభా రియాక్ట్ అవుతూ.. ఇటీవల కలకత్తా హైకోర్టు తీసుకు వచ్చిన కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ ప్రియదర్శికి వార్నింగ్ ఇచ్చారు. తెలియని అమ్మాయిని డార్లింగ్ అని పిలిస్తే అది సెక్సువల్ గా వేధించినట్లు అవుతుందని కోర్టు తీర్పుని ఇచ్చింది. ఇక ప్రియదర్శికి నభా ఈ తీర్పుని చూపిస్తూనే.. మాటలు మాట్లాడే అప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చారు. కానీ ప్రియదర్శి.. లైట్ తీసుకో డార్లింగ్ అంటూ నభా వార్నింగ్ కొట్టిపారేశారు.

ఇది ఇలా ఉంటే, హీరోయిన్ రీతూ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు షేర్ చేసారు. ఇక ఆ పిక్స్ చూసిన ప్రియదర్శి.. “వావ్ రీతూ డార్లింగ్. సూపర్ ఉన్నావు. నీ మెస్మరైజింగ్ అందం చూసి మాటలు కూడా రావడం లేదు” అని కామెంట్ చేసారు. ఇక ఈ కామెంట్ చూసిన నభా.. “ఇదిగో ఇక్కడికి వచ్చేసాడు. ఇతనికి సడన్ గా ఏమైంది. మైండ్ ఏమైనా పోయిందా” అంటూ సీరియస్ కామెంట్స్ చేసారు.

దీనికి ప్రియదర్శి రియాక్ట్ అవుతూ.. అరే నేను డార్లింగ్ అని పిలుస్తుంటే మీకు ఎందుకు కోపం వస్తుంది మేడం అంటూ కామెంట్ చేసారు. ఇక ఈ కామెంట్స్ చూసిన రీతూ వర్మ.. “నా కామెంట్ సెక్షన్ లో మీ పంచాయితీ ఏంటి” అంటూ కామెంట్ చేసారు. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగమని తెలుస్తుంది. ప్రియదర్శి మెయిన్ లీడ్ తెరకెక్కుతున్న ఓ సినిమాలో నభా నటిస్తున్నట్లు తెలుస్తుంది.

Also read : Nabha Natesh : నటుడు ప్రియదర్శి పై కేసు పెడతానంటున్న నభా నటేష్.. అసలేమైంది..?