Richest Actress: బాలీవుడ్ రిచెస్ట్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్.. మొత్తం సంపాదన ఎంతో తెలుసా!

బాలీవుడ్ ను శాసిస్తున్న హీరో హీరోయిన్లకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ అందుతోంది.

Published By: HashtagU Telugu Desk
Aishwarya

Aishwarya

బాలీవుడ్.. (Bollywod) ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీలో ఒకటిగా చెలామణి అవుతోంది. ఇక బాలీవుడ్ ను శాసిస్తున్న హీరో హీరోయిన్లకు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ అందుతోంది. ఒక్క సినిమాకే వంద కోట్లుకుపైగా తీసుకుంటున్న స్టార్స్ కూడా ఉన్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు యాడ్స్, ఇతర ప్రకటనల్లో నటిస్తూ బాగానే డబ్బు సంపాదిస్తున్నారు. చాలా మంది నటీమణులు ఇప్పటికీ మిలియనీర్స్ క్లబ్‌లో ఉన్నారంటే.. వాళ్ల సంపాదన ఏ రేంజ్ లో ఇట్టే అర్ధంచేసుకోవచ్చు.

భారతదేశం 2023లో బాలీవుడ్‌లో అత్యంత ధనిక నటిగా ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai Bachchan) రికార్డకెక్కింది. 800 కోట్లకు పైగా నికర ఆదాయంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనిక నటిగా గుర్తింపు పొందింది. ఈ ప్రపంచ సుందరి అటు బాలీవుడ్, ఇటు హాలీవుడ్ రెండింటిలోనూ సక్సెస్ గా కావడంతో ఆదరణతో పాటు సంపాదన కూడా పెరిగింది.

ఐశ్వర్య (Aishwarya Rai Bachchan) 1997లో మణిరత్నం ‘ఇరువర్’లో తొలిసారిగా నటించింది. కొద్దికాలంలోనే బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా పేరు సంపాదించుకుంది. ‘హమ్ దిల్ దే చుకే సనమ్,’ ‘దేవదాస్,’ మరియు ‘జోధా అక్బర్,’ వంటి అనేక హిట్ చిత్రాలలో కనిపించి ఆకట్టుకుంది. అయితే ఒక్క సినిమాకు 10 కోట్ల రూపాయల వరకు ఐశ్వర్య వసూలు చేస్తుందని టాక్. ఇక ఎండోర్స్ మెంట్, యాడ్స్ తో ద్వారా కూడా ఈ బ్యూటీ బాగానే సంపాదిస్తోంది. సల్మాన్, షారుఖ్, అమిర్ ఖాన్ తో సమానంగా (Aishwarya Rai Bachchan) పారితోషికం తీసుకున్న సందర్భాలున్నాయి.

Also Read: Kohli’s Fitness: కోహ్లీ ఫిట్ నెస్ సీక్రెట్ ఎంటో తెలుసా!

  Last Updated: 25 Mar 2023, 12:08 PM IST