Site icon HashtagU Telugu

RGV : రాజమౌళికి ఆర్‌జీవీ అండ.. విమర్శల వెనుక అసలు కారణం అదేనంటా ?

RGV's support for Rajamouli.. Is that the real reason behind the criticism?

RGV's support for Rajamouli.. Is that the real reason behind the criticism?

RGV: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి(S.S. Rajamouli)పై జరుగుతున్న విమర్శల నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. ఇటీవల తన కొత్త సినిమా ‘వారణాసి’ టైటిల్ లాంఛ్ కార్యక్రమం(‘Varanasi’ title launch event)లో రాజమౌళి మాట్లాడుతూ, త‌న‌కు దేవుడిపై అంత‌గా నమ్మకం లేద‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పలువురు ఆయనను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్‌జీవీ తన ‘ఎక్స్’ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అతనిపై విమర్శలు గుప్పిస్తున్న వారిని ఉద్దేశించి వర్మ తనదైన శైలిలో మాటలతో వార్నింగ్ ఇచ్చారు.

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై ..కేంద్ర కమిటీ సంచలన ప్రకటన

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి నమ్మే హక్కు ఉన్నంతే నమ్మకపోవడానికి కూడా సమానమైన హక్కు ఇస్తుంది. ముఖ్యంగా ఆర్టికల్ 25 ప్రకారం ధార్మిక స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న న్యాయబద్ధమైన హక్కు. ‘‘నమ్మకపోతే నేరమా?’’ అని ప్రశ్నిస్తూ, రాజమౌళిని దూషిస్తున్న వారు రాజ్యాంగం చదవాలని ఆర్‌జీవీ చురకలు వేసారు. రాజమౌళిపై విషం చిమ్ముతున్నవారు ఒకటి గుర్తుంచుకోవాలి. భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం నమ్మకపోవడానికీ హక్కు ఉంది అని వర్మ తెలిపారు.

అలాగే దేవుడిని నమ్మకపోతే దేవుడిపై సినిమాలు ఎలా తీయగలరు? అనే విమర్శను పూర్తిగా అర్థరహితమని కొట్టిపారేశారు. ఆ లాజిక్ నిజమైతే, గ్యాంగ్‌స్టర్ సినిమాలు తీయాలంటే దర్శకుడు ముందుగా గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? హారర్ చిత్రాలు తీయాలంటే దెయ్యం కావాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా, ఆయనకు వచ్చిన విజయాలు, సంపద అవి కూడా దేవుడిచ్చిందే అని కొందరు చెప్పే వాదన అసలు సమస్య కాదు. అసలు ఇబ్బంది రాజమౌళి నాస్తికత్వం కాదు. ఆయన విజయాన్ని జీర్ణించుకోలేని కొంతమంది వ్యక్తుల్లోని అసూయే ఈ విమర్శల గుండెల్లో దాగి ఉంది అని సూటిగా చెప్పారు. ఆయన అభిప్రాయంలో, దైవభక్తి పేరుతో బయట పడుతున్న కోపం అంతా లోపల దాచుకున్న ఈర్ష్యను కప్పిపుచ్చడానికేనని స్పష్టం చేశారు.

Jan Suraaj Party : మాకూ రూ.1000 ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి!

పూజలు చేసి కూడా ఫలితం రాకపోవడం వల్లే కొందరు రాజమౌళి లాంటి వ్యక్తుల ఎదుగుదల చూడలేక ఇలా విమర్శలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. రాజమౌళి ‘వారణాసి’ సినిమాతో ఇంకా పెద్ద విజయాలు సాధిస్తారు. ఆయన బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది. అప్పటి వరకు విమర్శకులు అసూయతో ఏడుస్తూ ఉంటారు అని వ్యంగ్యంగా అన్నారు. తన పోస్ట్‌ను ముగిస్తూ ‘జై శ్రీరామ్’ అంటూ రాశారు. ఈ ఘటన మరోసారి ఒక విషయం స్పష్టంచేస్తుంది. నమ్మకం వ్యక్తిగతం అది ఎవరి మీదనైనా బలవంతం చేయలేము. రాజమౌళి వ్యాఖ్యలపై ఆర్‌జీవీ స్పందన వివాదాన్ని మరింత వేడెక్కించినా భావ ప్రాముఖ్యతపరంగా సమాజంలో వ్యక్తిగత నమ్మకాలపై చర్చించే ముహూర్తాన్ని తీసుకొచ్చింది.

Exit mobile version