RGV Thanks to Lokesh : వ్యూహం రిలీజ్ కు సహకరించినందుకు..!!

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 11:17 PM IST

టైటిల్ చూసి అదేంటి ..వ్యూహం (Vyuham) రిలీజ్ కు నారా లోకేష్ (Nara Lokesh) సహకరించడం ఏంటి..? ఈ సినిమా జగన్ (Jagan) బయోపిక్ కదా..అంటే టీడీపీ కి వ్యతిరేకం కదా..అలాంటి ఈ సినిమాకు లోకేష్ సహకరించడం ఏంటి అని అంత అనుకుంటున్నారా..? మరి వర్మ అంటే అంతేకదా..ఆయన ఏంచేసినా..ఏ కామెంట్ చేసిన..ఏ వీడియో షేర్ చేసిన అది వైరల్ కావాల్సిందే కదా..! మాములుగా చేసిన , చెప్పిన కొత్తమీ ఉంటుంది..అందుకే వర్మ ఏదైనా తనవైపు తిప్పుకులే మాట్లాడడం, ట్వీట్స్ చేయడం ఆయనకే సొంతం.

We’re now on WhatsApp. Click to Join.

వర్మ తెరకెక్కించిన పొలిటికల్ మూవీ ‘వ్యూహం’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం జగన్ ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. తర్వాత డిసెంబర్ 29వ తేదీకి వాయిదా వేశారు. ఇదే క్రమంలో ‘వ్యూహం’ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసి, విడుదలను నిలిపేయాలని నారా లోకేష్ హైకోర్టులో పిటీషన్ వేయడం తో రిలీజ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు కోర్ట్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తో ఫిబ్రవరి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో వర్మ సినిమా ప్రమోషన్స్ ను చేస్తూ సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా ఈరోజు సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ఈవెంట్లో టీడీపీ నేత లోకేష్ కు వర్మ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ‘మీడియా మిత్రులెవరికీ థాంక్స్ చెప్పను. కానీ నా ప్రియ మిత్రుడు లోకేశ్ కు చెబుతాను. ఈరోజు మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి ఆయనే కారణం. డిసెంబర్లో సినిమా రిలీజై ఉంటే ప్రజలు మర్చిపోయేవారు. తెలివైన లోకేశ్ వ్యూహం ను ఎన్నికల ముందు విడుదలయ్యేలా చేశారు’ అందుకే ఆయనకు స్పెషల్ థాంక్స్ చెపుతున్న అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న వారంతా ఇది నిజమే కదా..డిసెంబర్ లో రిలీజ్ అయితే ఇపటికల్లా సినిమాను అంత మరచిపోయేవారు..కానీ ఇప్పుడు రిలీజ్ అయితే ఆ ఎఫెక్ట్ ఎన్నికల ఫై ఖచ్చితంగా పడనుందని మాట్లాడుకుంటున్నారు.

ఇప్పటీకే యాత్ర 2 వచ్చి ప్రజలను ఆకట్టుకోగా..ఇక ఇప్పుడు వ్యూహాం మూవీ వస్తే ఆ ఎఫెక్ట్ ఇంకెలా ఉంటుందో అని మాట్లాడుకుంటున్నారు.

Read Also : CM Revanth Reddy: సీబీఐ విచారిస్తే కేసీఆర్ సేఫ్: సీఎం రేవంత్ రెడ్డి