RGV – Janhvi Kapoor : ఆర్జీవీ ఒకప్పుడు సినిమాలతో సంచలనాలు సృష్టించి ఇప్పుడు ట్వీట్స్, కామెంట్స్ తో సంచలనం అవుతున్నాడు. చేతిలో సినిమాలు లేకపోయినా రెగ్యులర్ గా వార్తల్లో ఉంటాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పై వ్యాఖ్యలు చేసి వైరల్ అవుతున్నాడు రామ్ గోపాల్ వర్మ.
ఆర్జీవికి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. శ్రీదేవి ఫేవరేట్ హీరోయిన్ మాత్రమే కాదు అతను ఆరాధించే దేవత. శ్రీదేవితో కలిసి పనిచేసాడు కూడా. ఆర్జీవికి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ఆమెకు కూడా తెలుసు. సమయం వచ్చినప్పుడల్లా ఆర్జీవీ శ్రీదేవి గురించి మాట్లాడతాడు. ఎప్పుడూ బాధపడని ఆర్జీవీ శ్రీదేవి చనిపోయినప్పుడు మాత్రం బాధపడ్డాడు. శ్రీదేవికి అంతటి అభిమాని అయినా ఆర్జీవీ ఆమె కూతురుతో సినిమా చేయను, ఆమెకు శ్రీదేవి అందం రాలేదు అని అన్నారు.
ఆర్జీవీ మాట్లాడుతూ.. శ్రీదేవిని వేరే వాళ్ళతో పోల్చడం నాకు ఇష్టం లేదు. శ్రీదేవిని చూస్తే అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఆమెలా ఆమె కూతురు జాన్వీ కపూర్ లేదు. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. నాకు శ్రీదేవి అంటే ఇష్టం జాన్వీ కాదు. నాకు జాన్వీతో అంత కాంటాక్ట్ లేదు. జాన్వీ కపూర్ తో నాకు సినిమా తీసే ఉద్దేశం లేదు అని అన్నారు. దీంతో ఆర్జీవీ జాన్వీపై ఈ రేంజ్ లో కామెంట్స్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ హర్ట్ అయి విమర్శలు చేస్తున్నారు.
ఇక జాన్వీ కపూర్ ఇటీవల దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో RC16 సినిమాలో నటిస్తుంది.
Also Read : Brahmani : బాలయ్య కూతురు బ్రాహ్మణికి హీరోయిన్ ఆఫర్ ఇచ్చిన మణిరత్నం.. కానీ..