RGV : తెలంగాణ రియల్ టైగర్ రేవంత్…ఆర్జీవీ సంచలన ట్వీట్!!

దర్శకుడు రాం గోపాల్ వర్మ....వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.

  • Written By:
  • Publish Date - April 28, 2022 / 12:22 AM IST

దర్శకుడు రాం గోపాల్ వర్మ….వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. విషయం ఏదైనా సరే…ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారు. అలా కొన్ని వివాదాలను కోరి మరీ తెచ్చుకుంటారు. ఆర్జీవీ వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో మీడియాలో హెడ్ లైన్ వార్తలుగా కూడా ఉంటాయి.

తాజాగా ఆర్జీవీ…టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ, రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. విత్ రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ అనే క్యాఫ్షన్ కూడా ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

తెలంగాణలో నిజమైన పులి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ మధ్యే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన వర్మ…అంతలోనే కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ జిల్లా చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళీపై బయోపిక్ కొండా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని సినిమా తీసేందుకు వర్మ కలిశారా అనేది సందేహం తలెత్తుతుంది. ఇక ఈ ఫోటోలో వర్మ ఆప్యాయంగా రేవంత్ రెడ్డి భుజంపై చేయి వేయడం చూసి నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు.