Site icon HashtagU Telugu

Saree Movie Song : ఆర్జీవీ నుంచి మరో హాట్ సాంగ్.. ‘శారీ’ సినిమా ఫస్ట్ సాంగ్ చూశారా..?

RGV Aaradhya Devi Saree Movie Song Released

Rgv Saree Song

Saree Movie Song : ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసిన సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(RGV) ఇప్పుడు మాత్రం తన ఇష్టం అంటూ తనకిష్టమైన సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ మలయాళీ భామ ఆరాధ్య దేవితో శారీ అనే సినిమా తీస్తానని ప్రకటించాడు. చెప్పినట్టే ఆ అమ్మాయిని పట్టుకొని హైదరాబాద్ కి తీసుకొచ్చి ఆమెతో శారీ సినిమా తీసాడు.

ఇటీవలే ఈ శారీ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాడు. కొన్ని రోజుల క్రితం శారీ టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు శారీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు. సినిమా ప్రమోషన్స్ ముందు ఆరాధ్య దేవితో హాట్ హాట్ ఫోటోషూట్ చేయించి ఆ ఫోటోలను బాగా వైరల్ చేసాడు. దీంతో కుర్రాళ్లలో ఈ శారీ సినిమా ఆరాధ్య కోసం అయినా చూడాలి అనుకునేలా చేసాడు ఆర్జీవీ.

ఇప్పుడు శారీ సినిమాలో ఫస్ట్ సాంగ్ కూడా ఫుల్ హాట్ గా చిత్రీకరించారు. అడవుల్లో, జలపాతాల వద్ద ఆరాధ్య దేవి అందాలు అన్ని ఆరబోస్తూ హాట్ విజువల్స్ తో ఈ సాంగ్ ని షూట్ చేసారు. ఇక ఈ పాటని ఆర్జీవీ డెన్ అని కొత్త మ్యూజిక్ ఛానల్ పెట్టి అందులో విడుదల చేసారు. దీంతో ఈ శారీ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఈ హాట్ సాంగ్ చూసేయండి..

Also Read : Devara Trailer : దేవర కొత్త ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అదరగొట్టాడుగా..