Site icon HashtagU Telugu

Sir Combo : ‘సార్’ కాంబో మళ్లీ రిపీట్

Sir Repet

Sir Repet

డైరెక్టర్ వెంకీ అట్లూరి – తమిళ్ హీరో ధనుష్ (Venky Atluri- Dhanush) కలయికలో మరో మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో వీరిద్దరి కలయికలో ‘సార్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. తెలుగు తో పాటు తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం రెండు భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని , ధనుష్ ను తెలుగు ఆడియన్స్ కు దగ్గర చేసింది. ఈ మూవీ తర్వాత వెంకీ ‘లక్కీ భాస్కర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టును ధనుష్ తో చేయబోతున్నాడు. ఈ మూవీ కి ‘హానెస్ట్ రాజా’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సినీ వర్గాలు చెపుతున్నారు. ఈ సినిమాకు సంబదించిన విశేషాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి చేయబోతున్నట్లు సమాచారం.

CM Chandrababu: కడప పార్లమెంట్‌ కూడా మనమే గెలవాలి: సీఎం చంద్రబాబు

ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరెక్షన్లో కుభేర (Kubhera) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నాగ్ కూడా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్లు తాజా సమాచారం. సాధారణంగా శేఖర్ కమ్ముల చిత్రాల్లో కథా బలం ఎక్కువ. ఇక ధనుష్‌తో చేస్తున్న మూవీ విషయానికొస్తే.. కేవలం స్క్రిప్ట్ కోసమే శేఖర్ కమ్ముల రెండేళ్లు వర్క్ చేసాడు. అంతేకాదు ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించనుండగా.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ మ్యూజిక్ అందించనున్నారు. మొత్తానికి ఇప్పటి వరకు మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలనే తెరకెక్కించిన శేఖర్ కమ్ముల.. తొలిసారి పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహించనున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.