Site icon HashtagU Telugu

Renu Desai : మళ్ళీ మొదలైన రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వివాదం..

Renu Desai Vs Pawan Kalyan Fans Comments War In Instagram

Renu Desai Vs Pawan Kalyan Fans Comments War In Instagram

Renu Desai : పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్ విడాకులతో విడిపోయి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎటువంటి బంధం లేకుండా, తమతమ జీవితాల్లో ముందుకు వెళ్తున్నారు. కానీ పవన్ అభిమానులు మాత్రం.. రేణూదేశాయ్ ని ఇంకా పవన్ సతీమణి గానే చూస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రేణూదేశాయ్ ఎటువంటి పోస్టు వేసినా.. దానిని పవన్ తో లింక్ చేస్తూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

వాటిలో కొన్ని కామెంట్స్ రేణూదేశాయ్ మనోభవాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో ఆమె వాటి పై రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ కామెంట్స్ ని కాస్త పవన్ అభిమానులు వివాదం చేస్తున్నారు. దీంతో ప్రతిసారి సోషల్ మీడియాలో రేణూదేశాయ్‌కి, పవన్ ఫ్యాన్స్‌కి మధ్య ఏదొక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఇక రీసెంట్ గా రేణూదేశాయ్ వేసిన ఒక పోస్ట్ పై పవన్ అభిమాని కామెంట్ చేయడం, దానిపై రేణూదేశాయ్ రియాక్ట్ అవ్వడం, ఆ రియాక్షన్ కి మరో అభిమాని మరో కామెంట్ చేయడంతో మరోసారి వివాదం మొదలైంది.

జంతు ప్రేమికురాలు అయిన రేణూదేశాయ్.. రీసెంట్ గా ఒక పోస్ట్ వేశారు. ఆ పోస్ట్ పై పవన్ కళ్యాణ్ అభిమాని రియాక్ట్ అవుతూ.. “మా పవన్ కళ్యాణ్ అన్నయ్యలా వాళ్ళది మంచి హృదయం” అంటూ కామెంట్ చేసాడు. దానికి రేణూదేశాయ్ రియాక్ట్ అవుతూ.. “నేను వేసే ప్రతి పోస్టుని మీరు ఎందుకని నా మాజీ భర్తతో పోల్చుతారు. నేను ఈ జంతు సంరక్షణని నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఆ గుణం నా మాజీ భర్త నుంచి వచ్చింది కాదు. ఆయనికి జంతువులు అంటే అంత ఇష్టం లేదు. కాబట్టి దయచేసి నా ప్రతి పనిని నా మాజీ భర్తతో పోల్చకండి” అంటూ రిప్లై ఇచ్చారు.

Pawan Kalyan Renu Desai

ఇక రేణూదేశాయ్ చేసిన ఈ కామెంట్స్‌లో.. ‘పవన్ కళ్యాణ్ కి జంతువులు అంటే అంత ఇష్టం లేదు’ అని అనడాని ఒక అభిమాని తప్పుబడుతూ సీరియస్ కామెంట్ చేసాడు. మేము ఇంకా ఆయన భార్య గానే భావిస్తున్నాము, కాబట్టి ఆయన పై కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కామెంట్స్ కి విసిగెత్తిపోయిన రేణూదేశాయ్.. వీళ్ళు అసలు ఎప్పుడు మారతారు అంటూ అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్ వేశారు.

Renu Desai Pawan Kalyan