Pawan Kalyan : బాబోయ్ పవన్ కూతురు కూడా ఏంటి ఇంత హైట్ అయ్యిపోయింది.. వీడియో వైరల్..

బాబోయ్ పవన్ కూతురు కూడా అకిరాలా ఇంత హైట్ అయ్యిపోయింది. రేణూదేశాయ్ షేర్ చేసిన వీడియో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Renu Desai Shares Pawan Kalyan Daughter Aadhya Konidela Video Gone Viral

Renu Desai Shares Pawan Kalyan Daughter Aadhya Konidela Video Gone Viral

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్ వారసులు అకిరా, ఆద్య గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా ప్రపంచానికి వీరిద్దరి దూరంగా ఉన్నప్పటికీ.. పవన్ అభిమానులు మాత్రం వీరిద్దరి పై ఓ కన్ను వేసి ఉంచుతున్నారు. పవన్ కి లాగానే వ్యక్తిగత విషయాల్లో అకిరా, ఆద్య కూడా లో ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తూ వస్తుంటారు. అయితే వారికీ సంబంధించిన విషయాలను మెగా ఫ్యామిలీ మెంబెర్స్ లేదా రేణూదేశాయ్ షేర్ చేస్తుండడంతో అభిమానులకు అకిరా అండ్ ఆద్య గురించి తెలుస్తుంటుంది.

ఈక్రమంలోనే ఆద్య గురించి రేణూదేశాయ్ తాజాగా ఓ పోస్ట్ వేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న ఆద్య కాలేజీకి వెళ్లబోతుంది. ఇక ఈ స్కూల్ గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించిన వీడియోని రేణూదేశాయ్ షేర్ చేసారు. ఈ వీడియోలో ఆద్య చాలా హైట్ గా కనిపిస్తుంది. మెగా వారసుల్లో వరుణ్ తేజ్ అందరికన్నా హైట్ అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే అకిరా, వరుణ్ కంటే హైట్. అకిరా హైట్ చూసి పెదనాన్న నాగబాబు హైట్ వచ్చిందని అందరూ అనుకున్నారు.

అయితే తాజాగా ఆద్యని చూస్తుంటే.. ఆమె కూడా అకిరాలా హైట్ గా కనిపిస్తుంది. మొన్నటి వరకు ఆద్య చిన్నగానే కనిపించింది. కానీ ఇప్పుడు ఈ వీడియోలో హైట్ గా కనిపిస్తుండడంతో.. “ఆద్య హైట్ ఎంత. తాను చాలా పొడుగుగా కనిపిస్తుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కాగా ఆద్య ఇటీవలే 14వ పుట్టినరోజుని పూర్తి చేసుకుంది. ఇక ఆద్య కెరీర్ విషయానికి వస్తే.. తాను ఆర్కిటెక్చర్ చదవాలని అనుకుంటున్నట్లు రేణూదేశాయ్ గతంలోనే చెప్పుకొచ్చారు. దీంతో ఆద్య సినిమా ఎంట్రీ ఉండదని తెలిసిపోయింది. అకిరా ఎంట్రీనే ఇంకా సందేహంలో ఉంది. ప్రస్తుతం అకిరా ఫిలిం స్కూల్ లో సంగీత పాటలు నేర్చుకుంటున్నాడు. తాను హీరోగా ఎంట్రీ ఇస్తాడా..? మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడా..? అనేది సస్పెన్స్ లో ఉంది.

  Last Updated: 19 Apr 2024, 01:24 PM IST