Renu Desai : పెంపుడు పిల్లితో అకిరా.. రేణు దేశాయ్ ఇంట్లో పెంపుడు పిల్లులు ఎన్నంటే.. వాటి పేర్లు..

రేణు దేశాయ్ జంతువుల కోసం పోరాడుతుంది. పిల్లులు, కుక్కల కోసం, వాటి బాగోగుల కోసం పనిచేస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Renu Desai Shares her Pet Cats Video and Akira Nandan Playing with cat Video goes Viral

Renu Desai Akira

Renu Desai : రేణు దేశాయ్ ఇటీవల బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తన పిల్లలు అకిరా నందన్, ఆద్యల గురించి ఏం పోస్ట్ చేసినా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా రేణు దేశాయ్ తన పెంపుడు పిల్లుల వీడియో ఒకటి పోస్ట్ చేసింది. అలాగే అకిరా నందన్ ఓ పెంపుడు పిల్లితో ఆడుకుంటున్న వీడియో కూడా పోస్ట్ చేసింది.

రేణు దేశాయ్ దగ్గర స్మోకీ అనే ఓ పెంపుడు పిల్లి ఉంది. అకిరా నందన్ ఆ పిల్లితో ఆడుకుంటున్న వీడియో ఒకటి పోస్ట్ చేసింది. ఇటీవల రోడ్ మీద కనపడిన ఓ పిల్లిని తెచ్చి రెనీ అనే పేరు పెట్టుకొని పెంచుకుంటుంది. వీటితో పాటు అన్యాయంగా ఓ పిల్లి పిల్లని రూమ్ లో బంధించిన వాళ్ళ దగ్గరి నుంచి కాపాడి తెచ్చుకుంది. దీనికి అంబా బై అనే పేరు పెట్టింది. ఈ మూడు పిల్లులు ఆడుకుంటున్న వీడియో కూడా పోస్ట్ చేసింది. కొంతమంది ఇలా బ్రీడింగ్ చేసి జంతువులని బంధించి అముతున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొనకండి. మీకు కావాలనుకుంటే దత్తత తీసుకోండి అని వీడియోలో తెలిపింది.

రేణు దేశాయ్ జంతువుల కోసం పోరాడుతుంది. పిల్లులు, కుక్కల కోసం, వాటి బాగోగుల కోసం పనిచేస్తుంది. ఇలా ఇంట్లో మూడు పిల్లుల్ని తీసుకొచ్చి పెంచడంతో పలువురు ఆమెని అభినందిస్తున్నారు. అయితే అకిరా నందన్ పిల్లితో ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

Also Read : Radha Krishna : ప్రభాస్ రాధేశ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ సోదరుడి మృతి.. ఎమోషనల్ పోస్ట్..

  Last Updated: 30 Jun 2024, 10:48 AM IST