Renu Desai : టాలీవుడ్ స్టార్ కపుల్ పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్.. విడాకులు తీసుకోని ఏళ్ళు గడుస్తుంది. అయినాసరి ఇప్పటికి పవన్ విషయాల్లోకి రేణూదేశాయ్ ని తీసుకు వస్తూ పలువురు కామెంట్స్ చేస్తుంటారు. పవన్ అభిమానులు సైతం రేణూదేశాయ్ దగ్గర నిత్యం పవన్ నామస్మరణం చేస్తుంటారు. జంతు ప్రేమికురాలు అయిన రేణూదేశాయ్.. సోషల్ మీడియాలో జంతుహింస గురించి, జంతు సంరక్షణ గురించి నిత్యం పోస్టులు వేస్తుంటారు.
ఈక్రమంలోనే రీసెంట్ గా కూడా ఒక పోస్టు వేయగా, దాని పై ఒక పవన్ కళ్యాణ్ అభిమాని రియాక్ట్ అవుతూ.. “మా పవన్ కళ్యాణ్ అన్నయ్యలా వాళ్ళది మంచి హృదయం” అంటూ కామెంట్ చేసాడు. దానికి రేణూదేశాయ్ రియాక్ట్ అవుతూ.. “నేను వేసే ప్రతి పోస్టుని మీరు ఎందుకని నా మాజీ భర్తతో పోల్చుతారు. ఇలా చేస్తున్న మీలాంటి వారిని ఇప్పటికే వంద మంది పైగా బ్లాక్ చేశాను. అయినా ఇంకా ఇతరులు ఇలా కామెంట్ చేస్తూనే ఉన్నారు. నేను ఈ జంతు సంరక్షణని నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. కాబట్టి దయచేసి నా ప్రతి పనిని నా మాజీ భర్తతో పోల్చకండి” అంటూ రిప్లై ఇచ్చారు.
అంతేకాదు ఇది తాను కోపంతో ఇస్తున్న రిప్లై కాదని, బాధతో ఇస్తున్న జవాబు అని చెప్పుకొచ్చారు. తాను చేసిన ప్రతి పనిని తన మాజీ భర్తకి ఆపాదించడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఇన్‌స్టాగ్రామ్ తనని ఫాలో అయ్యే తన ఫాలోవర్స్‌ని.. మరోసరి ఇలా చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.