Renu Desai : లింగ వివక్షకు గురైన పవన్ మాజీ భార్య

అమ్మ నాన్నలు అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు. కానీ నేను అమ్మాయిగా పుట్టాను. చాలామందికి నేనంటే.. నా పెళ్లి.. విడాకులు వీటి గురించే మాట్లాడుకుంటారు.

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 11:28 AM IST

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ లింగ వివక్షకు గురైందట. ఈ విషయాన్నీ స్వయంగా రేణునే తెలిపింది. రేణు దేశాయ్ (Renu Desai) .. గురించి ప్రత్యేకంగా సినిమా లవర్స్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్, యాక్టర్, ఎడిటర్, ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇలా అనేక రంగాల్లో తన టాలెంట్ ను చూపించి అలరించారు.

2003 లో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన బద్రి (Badri) సినిమాతో రేణు దేశాయ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన రేణుదేశాయ్.. పవన్ కళ్యాణ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికీ అఖీరా, ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కొంత కాలానికి పలు కారణాల చేత వీళ్లిద్దరు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా రేణుదేశాయ్ మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao) సినిమాతో మళ్ళీ చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

అక్టోబర్ 20 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో రేణుదేశాయ్ సినిమా ప్రమోషన్ లలో పాల్గొంది. సినిమా విశేషాలనే కాకుండా తాను చిన్నప్పుడు ఎదురుకున్న కష్టాలను తెలిపింది. తాను పుట్టినప్పుడు పేరెంట్స్ నుంచి ఏ విధంగా లింగ వివక్షకు గురైందో చెప్పుకొచ్చింది. అమ్మ నాన్నలు అబ్బాయి పుట్టాలని కోరుకున్నారు. కానీ నేను అమ్మాయిగా పుట్టాను. చాలామందికి నేనంటే.. నా పెళ్లి.. విడాకులు వీటి గురించే మాట్లాడుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎదుర్కొన్నారు. మదర్స్ డే వస్తే నాకు బాల్యమే గుర్తొస్తుంది. నేను పుట్టిన తరువాత మూడు రోజుల వరకూ నా తండ్రి నా ముఖం చూడలేదు. ఎందుకంటే అమ్మాయినని. ఆ విషయం మా అమ్మ నాకు చెప్పేసరికి చాలా బాధ వేసింది. ఆ బాధ ఇప్పటికీ ఉండిపోయింది. కన్నతండ్రే నా నా ముఖం చూడలేదని బాధ వేసింది. ఆ వెంటనే ఏడాదిలో మా తమ్ముడు పుట్టేశాడు. వాడ్ని రాజాబాబులా పెంచారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆ వివక్ష అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆడబిడ్డని ఒకలా.. మగ బిడ్డని మరోలా చూశారు. తల్లి ఉండి.. తల్లి ప్రేమను ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోవడం అనేది చాలా బాధకరం. నా విడాకుల ఇష్యూ కంటే నన్ను ఇది ఎక్కువ బాధపెట్టింది. ఇలాంటి పేరెంట్స్ చాలా రేర్‌గా ఉంటారు. నన్ను పనివాళ్లు చూసుకున్నారు. అమ్మ ప్రేమకి నాన్న ప్రేమకి దూరమయ్యాను. ముందు అక్క పుట్టింది తనని బాగానే చూసుకున్నారు. తరువాత అబ్బాయి పుడతారని అనుకున్నారు. మళ్లీ అమ్మాయినే పుట్టాను. అదే వాళ్ల బాధ. తల్లి ప్రేమను పొందుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేశాను. అమ్మ ప్రేమ దొరుకుతుందని.. బాగా చదివేదాన్ని.. అమ్మకి నచ్చేట్టు ఉండేదాన్ని.. మెచ్చుకోవాలని తపించేదాన్ని. అయినా తల్లి ప్రేమ దొరకలేదు.

19 ఏళ్లు వచ్చిన తరువాత నేను అమ్మని అడిగాను.. అమ్మా నీ ప్రేమ నాకు ఎందుకు ఇవ్వడం లేదు.. అమ్మ ప్రేమ ఇవ్వు అని అడిగాను. అడిగినా నాకు అమ్మ ప్రేమ దొరకలేదు. అందుకే నేను ఏదైతే ప్రేమను కోల్పోయానో.. దానికి రెట్టింపు ప్రేమను ఇచ్చాను నా బిడ్డలకు. నేను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రేమను పంచాను.. పిల్లలకి ఎంత ప్రేమను పెంచాలనేదానికి హ్యాండ్ బుక్ అనేది లేదు కాబట్టి.. ఎంత చేయగలనో అంత చేస్తున్నా.. ఎక్కువ ప్రేమ ఉండాలి కానీ.. ప్రేమ తగ్గకూడదనే నా తపన’ అంటూ చెప్పుకొచ్చింది.

Read Also : Chiranjeevi : మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్‌కి రెడీ.. థియేటర్స్ లో మోత ఖాయం..