Renu Desai Mother: రేణు దేశాయ్ ఇంట విషాదం

రేణు దేశాయ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి నేడు మరణించినట్లు తెలుస్తోంది. తన తల్లి పాత ఫొటో షేర్ చేసిన రేణుదేశాయ్‌.. ప్రశాంతంగా ఉండు అమ్మ.. పుట్టిన వారు మరణించాక తప్పదు, మరణించిన వారు మళ్ళీ పుట్టాక తప్పదు అని అర్ధం వచ్చేలా ఓ కొటేషన్ షేర్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Renu Desai Mother

Renu Desai Mother

Renu Desai Mother: సినీ ఇండ‌స్ట్రీలో విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్‌, బాలీవుడ్‌, ఇత‌ర ఇండ‌స్ట్రీల్లో వ‌రుస విషాదాలు చోటుచేసుకుంటున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. రోజు ఏదో ఒక విష‌యంలో సినీ ఇండ‌స్ట్రీల నుంచి విషాద వార్తలు వినాల్సి వ‌స్తుంది. ఈ మ‌ధ్య కాలంలోనే సినీ న‌టుడు ఢిల్లీ గ‌ణేష్, బెంగాలీ న‌టుడు మ‌నోజ్ మిత్రా, త‌దిత‌రులు క‌న్నుమూశారు. ఇక‌పోతే ఈరోజు ఇండ‌స్ట్రీలో మ‌రో విషాద వార్త వెలుగులోకి వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య, న‌టి రేణు దేశాయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రేణు దేశాయ్ త‌ల్లి (Renu Desai Mother) గురువారం క‌న్నుమూసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని దేశాయ్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ఓ కొటేష‌న్ పోస్ట్ చేశారు.

రేణు దేశాయ్ త‌ల్లి క‌న్నుమూత‌

రేణు దేశాయ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి నేడు మరణించినట్లు తెలుస్తోంది. తన తల్లి పాత ఫొటో షేర్ చేసిన రేణుదేశాయ్‌.. ప్రశాంతంగా ఉండు అమ్మ.. పుట్టిన వారు మరణించాక తప్పదు, మరణించిన వారు మళ్ళీ పుట్టాక తప్పదు అని అర్ధం వచ్చేలా ఓ కొటేషన్ షేర్ చేసింది. దీంతో పలువురు ఫ్యాన్స్, నెటిజన్లు రేణు తల్లికి సోషల్‌మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

Also Read: Kenya Cancels Deal With Adani: అదానీకి మ‌రో బిగ్ షాక్‌.. డీల్ క్యాన్సిల్ చేసుకున్న కెన్యా!

రేణు దేశాయ్ పోస్ట్

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం|
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే||

మళ్లీ మళ్లీ ఒక‌రు పుడతారు,
మరల మరల ఒకరు మరణిస్తారు,
మరల మరల ఒకరు తల్లి కడుపులో నిద్రపోతారు. ఈ అపార దుఃఖ సంసార సాగరం నుండి వెలువడు మార్గము కానక కడు శోక చిత్తులమైన మనకు శ్రీహరి పాదారవిందములు తప్ప అన్య మార్గము లేదు అంటూ ఆది శంకరాచార్య పలికిన శ్లోకాన్ని పోస్ట్ చేశారు. ఆమెకు ధైర్యం చెబుతూ నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. ఓం శాంతి ఓం అంటూ కొంద‌రు నెటిజ‌న్లు పోస్టులు పెట్ట‌గా.. ధైర్యంగా ఉండండి అని మ‌రికొంద‌రు పోస్టులు పెట్టారు.

  Last Updated: 21 Nov 2024, 08:53 PM IST