Renu Desai : వరుణ్ తేజ్ పెళ్ళికి వెళ్లట్లేదు.. నేను వెళ్తే అక్కడ అందరూ.. రేణు దేశాయ్ వ్యాఖ్యలు..

రేణు దేశాయ్(Renu Desai) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుణ్ నాకు 8 ఏళ్ళు ఉన్నప్పట్నుంచి తెలుసు. నా కళ్ళ ముందు పెరిగాడు.

Published By: HashtagU Telugu Desk
Renu Desai Comments on varun Tej Lavanya Tripathi Marriage

Renu Desai Comments on varun Tej Lavanya Tripathi Marriage

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇప్పుడు వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇక్కడ హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసుకొని ఇప్పుడు ఇటలీలో(Italy) డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి వెళ్లారు. ఇటలీ టుస్కానీ నగరంలో వరుణ్ లావణ్య పెళ్లి రెండు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితుల మధ్యే జరుగుతుంది.

ఈ పెళ్ళికి ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీ కూడా వెళ్లారు. పవన్ తన భార్య అన్నా లెజనోవాతో సహా మెగా ఫ్యామిలీ అంతా పెళ్ళికి వెళ్లారు. కానీ పవన్ పిల్లలు అకిరా నందన్, ఆద్య మాత్రం వరుణ్ పెళ్ళికి వెళ్లట్లేదు. గతంలో నిహారిక పెళ్ళిలో పవన్ తో వీరిద్దరూ వచ్చి సందడి చేశారు. తాజాగా రేణు దేశాయ్ వరుణ్ పెళ్లిపై కామెంట్స్ చేసింది.

రేణు దేశాయ్(Renu Desai) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుణ్ నాకు 8 ఏళ్ళు ఉన్నప్పట్నుంచి తెలుసు. నా కళ్ళ ముందు పెరిగాడు. వరుణ్ పెళ్ళికి నేను వెళ్లట్లేదు. నేను వెళ్తే అక్కడ అందరూ అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. గతంలో నిహారిక పెళ్ళికి కూడా వెళ్ళలేదు. పిల్లల్ని మాత్రం పంపించాను. నేను పెళ్ళికి వెళ్లకపోయినా వరుణ్ కి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. వరుణ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను అని తెలిపింది. దీంతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక వరుణ్ పెళ్ళికి అకిరా, ఆద్య కూడా వెళ్ళకపోవడం గమనార్హం.

 

Also Read : Mahesh Babu : గుంటూరు కారంలో పూజా హెగ్దె.. మళ్లీ మొదటికొచ్చిన మ్యాటర్..!

  Last Updated: 30 Oct 2023, 05:35 PM IST