Renu Desai : సోషల్ మీడియా వేదికగా రూ.3500 సాయం అడిగిన రేణుదేశాయ్

చిన్న పిల్లల కోసం, పెంపుడు జంతువులు, ఆవుల సంరక్షణ కోసం తన సంపాదనలో నెల నెలా కొంత మొత్తాన్ని విరాళంగా రేణు ఇస్తుంటుందట

Published By: HashtagU Telugu Desk

పవర్ స్టార్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణుదేశాయ్ (Renu Desai)..సోషల్ మీడియా వేదికగా రూ.3500 అడగడం అందర్నీ ఆశ్చర్యానికి , అలాగే షాక్ కు గురి చేసింది. రేణు ఏంటి రూ.3500 అడగడం ఏంటి అని మాట్లాడుకున్నారు. కొంతమందైతే ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యి ఉంటుంది కావొచ్చు..లేకపోతే ఆమె అడగడం ఏంటి అని అనుకున్నారు. కానీ ఇది నిజమే అని స్వయంగా ఆమె తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

తన అకౌంట్ హ్యాక్ కాలేదని .. ఫుడ్ పాయిజన్ కారణంగా తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాలేదని తెలిపింది. అందుకే వీడియో చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. నేను రెగ్యులర్‌గా కొంత మొత్తాన్ని డొనేట్ చేస్తుంటాను. నా సంపాదనలో కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయించాను. అయితే, అప్పుడప్పుడూ కాస్త ఎక్కువ అవసరం పడుతుంది. నాకూ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. నా డబ్బునంతా డొనేషన్స్‌కు ఇచ్చేస్తే.. నా పిల్లల కోసం కావాలి కదా..! అందువల్ల నా వరకు సాయం చేశాక.. ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్‌ను అడుగుతున్నాను’ అని రేణూ దేశాయ్ తెలిపింది.

చిన్న పిల్లల కోసం, పెంపుడు జంతువులు, ఆవుల సంరక్షణ కోసం తన సంపాదనలో నెల నెలా కొంత మొత్తాన్ని విరాళంగా రేణు ఇస్తుంటుందట. ఆవుల కోసం సొంతంగా ఓ షెడ్డును కూడా నిర్మిస్తున్నారట. ఏడాదిన్నర లోగా ఆ షెడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఆమె తెలిపింది. అప్పుడు తానే అధికారికంగా విరాళాలు సేకరిస్తానని రేణూ దేశాయ్ తెలిపింది. ఇక నా పట్ల ప్రేమ, కేర్ చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా రిక్వెస్ట్‌కు 5 నిమిషాల్లోనే స్పందించారు. మానవత్వంతో స్పందించి రూ. 3500 పంపించిన అందరికీ ధన్యవాదాలు’ అని రేణు దేశాయ్ పేర్కొంది.

Read Also : Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..దేవర ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

  Last Updated: 15 May 2024, 10:21 PM IST