Site icon HashtagU Telugu

NTR Ghat : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు

Ntr Flexi

Ntr Flexi

మరోసారి జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీసింది. గత కొద్దీ రోజులుగా టీడీపీ శ్రేణులకు – ఎన్టీఆర్ అభిమానులకు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ సభల్లో కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో నానా హడావిడి చేయడం..దానికి టీడీపీ శ్రేణులు రెచ్చిపోవడం ఇలా ప్రతిసారి ప్లెక్సీ వార్ అనేది కొనసాగుతూనే ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఈరోజు నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్బంగా కూడా అదే జరిగింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాం నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాటు కు చేరుకుని అంజలి ఘటించారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫ్లెక్సీలను, పోస్టర్‌లను రోడ్డుకు ఇరువైపులా.. నివాళులర్పించేందుకు వస్తున్న టీడీపీ అభిమానులకు స్వాగతం తెలుపుతున్నట్లుగా ఉంచారు. అయితే కారణాలేంటో తెలియదుగానీ.. ఈ ఉదయం నందమూరి వారసులైన బాలకృష్ణ, రామకృష్ణలు లు నివాళులర్పించి వెళ్లగానే.. అక్కడ జూ. ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం మొదలుపెట్టారు. మరి ఏది ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది.

Read Also : Free Bus Scheme : ఫ్రీ బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టు లో పిటిషన్