బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్( Saif Ali Khan)పై దాడి (Attack ) జరగడం సినీ పరిశ్రమలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ముంబై బాంద్రాలోని తన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి (Robbery ) యత్నించి, సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసాడు. దాడి అనంతరం సైఫ్ ను కుటుంబ సభ్యులు లీలావతి ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స తీసుకుంటున్న సైఫ్ ఆరోగ్యం ఎలా ఉందో అని సినీ ప్రముఖులు , అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా..తాజాగా సైఫ్ హెల్త్ బులిటెన్ ను వైద్యులు ప్రకటించారు. ఆయనను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించినట్లు తెలిపారు.
CM Revanth : సింగపూర్ ITEతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం
వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. సైఫ్ అలీఖాన్ చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశామని , వెన్నుపైన కత్తి లాంటి పదార్థాన్ని తొలగించినట్లు వెల్లడించారు. ఈ ప్రాసీజర్ విజయవంతంగా పూర్తయిందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం సైఫ్ మాట్లాడుతున్నారని, నడుస్తున్నారని, సాధారణ ఆహారం తీసుకుంటున్నారని , ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. సైఫ్ ఆరోగ్యం పట్ల ఎవరు ఖండారు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ బులిటెన్ తో అభిమానుల్లో కాస్త ఊరట కలిగించినట్లు అయ్యింది. సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.