Rithu Chowdhary : నా మార్ఫింగ్ వీడియోలతో దారుణంగా.. ఇబ్బందిపెట్టి.. వాడ్ని పోలీసులు పట్టుకున్నారు..

తాజాగా మరో వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది రీతూ చౌదరి. ఇందులో తన వీడియోల్ని మార్ఫింగ్(Morphing) చేసి, అసభ్యకరంగా ప్రమోట్ చేశారని..

Published By: HashtagU Telugu Desk
Reethu Choudary Complaints on her Morphed Video Police Arrest a Netizen

Reethu Choudary Complaints on her Morphed Video Police Arrested a Netizen

పలు సీరియల్స్, షోలు, సోషల్ మీడియాతో బాగా పాపులర్ అయింది రీతూ చౌదరి(Rithu Chowdhary). రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పెట్టి ఫ్యాన్స్ ని అలరిస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇక యూట్యూబ్ లో కూడా రెగ్యులర్ గా తనకి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తుంది రీతూ.

ఇటీవల ఓ ఇంటీరియర్ డిజైనర్ వల్ల మోసపోయానని, మానసిక బాధ అనుభవించానని, అతనిపై పోలీస్ కేసు పెట్టినట్టు ఓ వీడియో తీసి అప్లోడ్ చేసింది. తాజాగా మరో వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది రీతూ చౌదరి. ఇందులో తన వీడియోల్ని మార్ఫింగ్(Morphing) చేసి, అసభ్యకరంగా ప్రమోట్ చేశారని, వాటితో బాగా మెంటల్ టార్చర్ చూశానని, పోలీసులు ఇప్పుడు అతన్ని పట్టుకున్నారని చెప్పింది.

రీతూ చౌదరి ఈ వీడియోలో.. నా ఫొటోలు, వీడియోలు ఎవరో మార్ఫింగ్ చేసి, నన్నే ట్యాగ్ చేసి నన్ను బాగా మెంటల్ టార్చర్ చేశారు. సోషల్ మీడియాలో నేనేం పెట్టినా రేటు ఎంత? నైట్ కి వస్తావా అంటూ దారుణంగా కామెంట్స్ చేశారు. ఈ ఘటన వల్ల చాలా భయపడ్డాను. కానీ సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్పాను. ఈ విషయంలో నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా నిలబడింది. విష్ణుప్రియ కూడా సహాయం చేసింది. పోలీసులు ఆ వీడియోలు చేసినవాడ్ని పట్టుకున్నారు. కానీ అతను ఏమి తెలియనివాడిలా మాట్లాడుతున్నాడు. మరికొంతమంది సోషల్ మీడియాలో వేధించే వారిపై కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇన్ని రోజులు ఈ విషయం బయటకి చెప్పాలా వద్దా అని ఆలోచించాను. కానీ అలాంటి వాళ్ళ గురించి అందరికి తెలియాలి. ఇలా చేయాలంటే భయపడాలి, ఇలాంటి వాటితో ఇబ్బందిపడేవాళ్లు ధైర్యంగా కంప్లైంట్ చేయండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను అని తెలిపింది. దీంతో రీతూ చౌదరి పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

 

 

Also Read : Pallavi Prashanth : బిగ్‌బాస్ గొడవలో ఇద్దరు అరెస్ట్.. A1 గా పల్లవి ప్రశాంత్, మరికొంతమందిపై కేసులు..

  Last Updated: 19 Dec 2023, 08:20 PM IST