Site icon HashtagU Telugu

Tollywood : డిసెంబర్ సినిమాలకు రెడ్ అలర్ట్ తప్పదా..?

Films

Films

Tollywood స్టార్ సినిమాల రిలీజ్ వాయిదాల వల్ల ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్న సినిమాలకు పెద్ద హెడేక్ గా మారింది. ఆగష్టు 15న వస్తాడని అనుకున్న పుష్ప 2 కాస్త డిసెంబర్ 6కి వాయిదా పడటంతో ఆ టైం కు రిలీజ్ చేయాలనుకున్న సినిమాలకు షాక్ తగిలినట్టు అయ్యింది. ఇక మరోపక్క డిసెంబర్ లోనే బాలయ్య సినిమా రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు. ఎన్.బి.కె 109వ సినిమాను కె.ఎస్ బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ కల్లా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.

మఓపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. హరి హర వీరమల్లు సినిమా నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉంది కాబట్టి ముందు ఆ సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. వీరమల్లు కన్నా ముందే సెప్టెంబర్ 27 ఓజీ రిలీజ్ అనౌన్స్ చేసినా దానికన్నా ముందు వీరమల్లుని రిలీజ్ చేసేలా చూస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం వీరమల్లు సినిమా డిసెంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

అదే జరిగితే డిసెంబర్ రేసు మరింత టఫ్ అవుతుంది. పుష్ప 2, వీరమల్లు, ఎన్.బి.కె 109 తో పాటు ఆల్రెడీ డిసెంబర్ లో రిలీజ్ లాక్ చేసుకున్న తండేల్, రాబిన్ హుడ్ సినిమాలకు రెడ్ అలర్ట్ తగలనుంది. మరి ఈ సినిమాల్లో ఏది ముందుకి ఏది వెనక్కి అవుతుందో తెలియదు కానీ ఆడియన్స్ కి మాత్రం సినిమాల జాతర ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Akira Nandan : ఓజీ కోసం అకిరా కూడా వెయిటింగ్..!