Radhe Shyam Movie: రిలీజ్ కు ముందే చరిత్ర సృష్టించిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’.!

  • Written By:
  • Updated On - February 27, 2022 / 10:38 AM IST

‘బాహుబలి’ సిరీస్ తో పాన్ ఇండియన్ స్టార్ గానే కాదు యూనివర్సల్ స్టార్ గా ఎదిగారు హీరో ప్రభాస్. ఆ ఒక్క సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకునేలా చేసింది. ఆ తర్వాల భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సాహో’ సినిమా బాలీవుడ్ లో దుమ్ముదులిపింది. ఇక తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి విడుదలకు సిద్దంగా ఉన్న మూవీ ‘రాధేశ్యామ్’. అన్ని కార్యక్రామాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ, మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా 7 భాషల్లో విడుదల కానుంది. అయితే రిలీజ్ కాకుండానే ఈ సినిమా ఓ అరుదైన ఘనతను సాధించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం…

ఇప్పటికే ‘బాహుబలి’ సిరీస్‌ తో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లని రాబట్టిన హీరోగా నిలిచారు డార్లింగ్ ప్రభాస్. అలాంటి స్టార్ హీరో ఇప్పుడు ‘రాధేశ్యామ్’ తో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమా అమెరికాలో రికార్డు స్థాయిలో విడుదల కాబోతోంది. విడుదలకు ఒక్కరోజు ముందే అంటే… మార్చి 10న ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఆరోజు ‘రాధేశ్యామ్’ ను యూఎస్ లో గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు అత్యంత భారీ స్థాయి లో రిలీజ్ చేస్తున్నారు. ఏకంగా 1116 లొకేషన్ లలో.. 3116 స్క్రీన్ లలో 11116 షోలను ప్రదర్శించనున్నారు.

ఈ స్ఠాయిలో ఇప్పటివరకు మరే హీరోకు ప్రీమియర్ షోలను ప్రదర్శించలేదు. ఇలా ఒక హీరో సినిమాను మాత్రమే ఈ రేంజ్‌లో ప్రదర్శించడం అమెరికాలో ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. అంతేకాదు, ఈ ఘనతను సొంతం చేసుకున్న ఏకైక నటుడు కూడా మన డార్లింగ్ ప్రభాసే. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమాను రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ మరియు టి సిరీస్ వారు సంయుక్తంగా గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీలో… ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. మార్చి 11న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం.