Raghavendra Rao : సినిమాల్లో రాఘవేంద్రరావు పేరు వెనుక బి.ఎ. ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

ఈయన ప్రతి సినిమా టైటిల్స్‌లో రాఘవేంద్రరావు పేరు వెనుక బి.ఎ. అని వేసి ఉంటుంది. ఇలా పేరు వెనుక డిగ్రీ ఎందుకు పెడుతున్నారు..? దాని వెనుక ఏమన్నా కారణం ఉందా..?

Published By: HashtagU Telugu Desk
Reason Behind Raghavendra Rao add BA to his name in Movie Title cards

Reason Behind Raghavendra Rao add BA to his name in Movie Title cards

100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకేంద్రుడు అనే బిరుదు సంపాదించుకున్న దర్శకుడు కె రాఘవేంద్రరావు(Raghavendra Rao) గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, చిరంజీవి, బాలకృష్ణ.. ఇలా అప్పట్నుంచి నేటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న రికార్డు ఆయనది. కాగా ఈయన ప్రతి సినిమా టైటిల్స్‌లో రాఘవేంద్రరావు పేరు వెనుక బి.ఎ. అని వేసి ఉంటుంది. ఇలా పేరు వెనుక డిగ్రీ ఎందుకు పెడుతున్నారు..? దాని వెనుక ఏమన్నా కారణం ఉందా..? అని చాలా మందిలో ఒక సందేహం ఉంది.

ఈ సందేహాలకు రాఘవేంద్రరావు ఒక సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులను, హీరోహీరోయిన్స్ ని కామన్ గా అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది. ఆ ప్రశ్నే.. మీరు ఇండస్ట్రీకి రాకపోతే ఏం చేసేవారు..? అలా రాఘవేంద్రరావుని.. “మీరు దర్శకుడు కాకపోతే ఏమయ్యేవారు..?” అని అడిగేవారు కోసం సమాధానం ఇచ్చేలా దర్శకేంద్రుడు పేరు వెనుక డిగ్రీ పెట్టేవారట. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ముందు మూడు చిత్రాలకు ఇదే ఆలోచనతో టైటిల్ లో డిగ్రీ వేశారు. కానీ ఐదో చిత్రం నుంచి మరో ఆలోచన కూడా వచ్చి చేరింది. ఈ మధ్యలో నాలుగో సినిమా దగ్గర ఏమైందని అనుకుంటున్నారా..?

నాలుగో సినిమా టైటిల్స్ లో పేరు వెనుక డిగ్రీ వేయలేదట. ఎందుకు వేయలేదు అని రాఘవేంద్రరావు కూడా ప్రశ్నించలేదట. కట్ చేస్తే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. మొదటి మూడు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో ఇది గమనించిన రాఘవేంద్రరావు పబ్లిసిటీ డిజైనర్‌‌తో.. “నా కోరిక లేదా డిమాండ్ అనుకోకండి. ఒక సెంటిమెంట్ అనుకోని నా నెక్స్ట్ సినిమా నుంచి టైటిల్స్ లో నా పేరు వెనుక డిగ్రీ వేయండి” అని చెప్పారట. ఇక అప్పటి నుంచి అది ఒక సెంటిమెంట్ లాగా కూడా మారిపోయిందట. కాగా రాఘవేంద్రరావు దర్శకుడు కాకుంటే డ్రైవర్ అయ్యేవారట. ఎందుకంటే ఆయనకు బాగా డ్రైవింగ్ వచ్చట. అప్పటిలో బి.ఎ. డిగ్రీకి పెద్ద ఉద్యోగాలు కూడా ఉండేవి కావట.

 

Also Read : Mega 156 : మెగా 156 విలన్ గా రానా.. మరో స్టార్ కూడా..!

  Last Updated: 19 Nov 2023, 08:49 PM IST