RC16 : చరణ్ బర్త్ డే ట్రీట్

RC16 : బుచ్చిబాబు తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో కొత్తదనం తీసుకొచ్చినట్లు, ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను నిరూపించనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Rc 16 First Look

Rc 16 First Look

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) – ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchhibabu) కలయికలో తెరకెక్కుతున్న ‘RC16’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రేపు రామ్ చరణ్ పుట్టినరోజు (Ram Charan Birthday) సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌(RC16 First Look)ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మార్చి 27న ఉదయం 9.09 గంటలకు ఈ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు రామ్ చరణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “యుద్ధంలో నిర్భయుడు.. మనస్సులో కనికరం లేనివాడు.. రేపు కలుద్దాం” అంటూ ఆయన ట్వీట్ చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.

Pastor Praveen : పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి వివరాలు తెలిపిన ఎస్పీ

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘RC16’ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు పని చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

‘RC16’ సినిమా యాక్షన్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా తెరకెక్కబోతోందని చిత్రబృందం తెలిపింది. బుచ్చిబాబు తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో కొత్తదనం తీసుకొచ్చినట్లు, ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను నిరూపించనున్నాడని అభిమానులు ఆశిస్తున్నారు.

  Last Updated: 26 Mar 2025, 09:31 PM IST