Raviteja మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా టైగర్ నాగేశ్వర రావు. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత కథా స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కింది. నేడు రిలీజైన ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ ఉంది. సినిమాలో రవితేజ నటన మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) ఇలా థియేటర్ లో రిలీజైందో లేదో అలా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి న్యూస్ బయటకు వచ్చింది.
రిలీజైన సినిమాల ఓటీటీ రిలీజ్ గురించి కూడా ఆడియన్స్ ఎగ్జైటెడ్ గా ఉంటారు. ఈ క్రమంలో టైగర్ నాగేశ్వర రావు డిజిటల్ స్ట్రీమింగ్ ఎందులో వస్తుంది అన్న ఆసక్తి ఉంది. అయితే రిలీజ్ నాడే ఆ కన్ ఫ్యూజన్ కి తెర పడింది. అమేజాన్ ప్రైమ్ (Amazon Prime) వారు టైగర్ నాగేశ్వర రావు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నారు. రవితేజ సినిమాకు మంచి ఫ్యాన్సీ ప్రైజ్ ఇచ్చి అమేజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది.
టైగర్ నాగేశ్వర రావు సినిమా లో నుపుర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో కొన్ని వావ్ అనే సీన్స్ ఉన్నా కూడా డైరెక్టర్ టేకింగ్ పూర్ వి.ఎఫ్.ఎక్స్, బిజిఎం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ కి రీచ్ కాలేదని అంటున్నారు. అయితే మాస్ రాజా ఫ్యాన్స్ మాత్రం సినిమాను చూసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు.
రవితేజ మొదటి పాన్ ఇండియా అటెంప్ట్ గా టైగర్ నాగేశ్వర రావు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఇక రవితేజ సినిమాలన్నీ కూడా నేషనల్ వైడ్ రిలీజ్ అవుతాయేమో చూడాలి.
Also Read : Vijay Devarakonda : శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..!