Raviteja Sitara Entertainments : రవితేజతో సితార ఎంటర్టైన్మెంట్స్.. డైరెక్టర్ ఎవరు..?

Raviteja Sitara Entertainments మాస్ మహారాజ్ రవితేజ బర్త్ డే సందర్భంగా మరో క్రేజీ కాంబో సినిమా ఒకటి అనౌన్స్ మెంట్ వచ్చింది. రవితేజతో సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా

Published By: HashtagU Telugu Desk
Raviteja Following Mahesh Babu and Allu Arjun

Raviteja Following Mahesh Babu and Allu Arjun

Raviteja Sitara Entertainments మాస్ మహారాజ్ రవితేజ బర్త్ డే సందర్భంగా మరో క్రేజీ కాంబో సినిమా ఒకటి అనౌన్స్ మెంట్ వచ్చింది. రవితేజతో సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా ప్రకటించారు. సితార ఎంటరైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. సితార బ్యానర్ లో సినిమా అంటే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

We’re now on WhatsApp : Click to Join

హారిక హాసిని బ్యానర్ లో స్టార్ సినిమాలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటే సితార బ్యానర్ లో మీడియం రేంజ్ సినిమాలు చేస్తున్నారు. నాగ వంశీ సినిమా మొదలైనప్పటి నుంచి రిలీజ్ వరకు సూపర్ బూస్టింగ్ ఇస్తారు. ఈ బ్యానర్ లో చిన్న సినిమాలను కూడా నిర్మిస్తారు నాగ వంశీ.

లేటెస్ట్ గా రవితేజతో సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది సస్పెన్స్ లో పెట్టారు. మరి రవితేజతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్న దర్శకుడు ఎవరు. వారిద్దరి కాంబో ఎలాంటి సినిమా రాబోతుంది అన్నది చూడాలి. ప్రస్తుతం రవితేజ నటించిన ఈగల్ రిలీజ్ కు రెడీ అవ్వగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు రవితేజ.

ఈ సినిమాతో పాటుగా అనుదీప్ కెవితో ఒక సినిమా ఉంటుందని టాక్. త్రివిక్రం కూడా రవితేజతో సినిమా చేయాలని చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Also Read : Bigg Boss OTT Second Season : బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్.. కంటెస్టెంట్స్ కాదు హోస్ట్ కూడా డౌటే..!

  Last Updated: 26 Jan 2024, 06:19 PM IST