మాస్ మహారాజా రవితేజ (Raviteja) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘RT76’ సినిమా రొమాంటిక్ కామెడీ జానర్‌లో రూపొందనుంది. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా ఇద్దరు భామలు నటించబోతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మమితా బైజు, కయాదు లోహర్ (Mamitha Baiju, Kayadu Lohar) ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించబోతున్నారని సమాచారం.
Ancient Coins : ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు వింత శబ్దం..తవ్వితే !
ఈ చిత్రానికి BVS రవి కథ అందించగా, SLV సినిమాస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వ శైలి, రవితేజ ఎనర్జీ, ఇద్దరు కొత్త హీరోయిన్ల గ్లామర్ కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
రవితేజకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో, ఈ సినిమా కూడా మంచి రిస్పాన్స్ తెచ్చుకునే అవకాశముంది. ఇప్పటికే రొమాంటిక్ కామెడీ జానర్‌లో కిశోర్ తిరుమల విజయవంతమైన చిత్రాలు అందించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేలా ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. ‘RT76’ గురించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.