Raviteja Eagle OTT Deal : ఈగల్ ఓటీటీ డీల్ క్లోజ్.. అందులో రానున్న రవితేజ మూవీ..!

Raviteja Eagle OTT Deal మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్

Published By: HashtagU Telugu Desk
Raviteja Eagle OTT Deal Close ETv Win Bought Digital Rights

Raviteja Eagle OTT Deal Close ETv Win Bought Digital Rights

Raviteja Eagle OTT Deal మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. మాస్ ఆడియన్స్ ని మెప్పించి 50 కోట్ల పైన గ్రాస్ రాబట్టిన ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్టే అని చెప్పొచ్చు. రవితేజ ఎనర్జీ.. కమర్షియల్ అంశాలన్నీ బాగా కుదిరాయి. అయితే ఈ సినిమా ఎందుకో ఆడియన్స్ నుంచి జస్ట్ ఓకే అనిపించుకుంది.

ఇదిలాఉంటే ఈగల్ సినిమా డిజిటల్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈటీవీ విన్ ఈమధ్య వెబ్ సీరీస్ లతో మెప్పిస్తుండగా సినిమాలను కూడా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో రవితేజ ఈగల్ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ వారు రైట్స్ కొనేశారు. త్వరలోనే ఈ సినిమా ఈటీవీ విన్ లో రిలీజ్ అవుతుంది.

ఎలాగు డిజిటల్ రైట్స్ ఈటీవీ విన్ తీసుకుంది కాబట్టి శాటిలైట్ రైట్స్ కూడా అదే ఛానెల్ తీసుకునే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత ఈటీవీ కొత్త సినిమాలను కొంటూ తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈగల్ ఈటీవీ విన్ లో రిలీజ్ అవ్వడం ఆ ఓటీటీ సబ్ స్క్రైబర్స్ కి సూపర్ కిక్ ఇస్తుంది.

Also Read : Sai Dharam Tej : ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. మెగా మేనల్లుడి ప్లాన్ అదుర్స్..!

  Last Updated: 23 Feb 2024, 08:58 PM IST