రవితేజ(Raviteja) ‘ఈగల్'(Eagle) సినిమా ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఫుల్ ఫామ్ లో ఉన్న పీపుల్స్ మీడియా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈగల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ మహారాజ లుక్ కొత్తగా ఉండటం, ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమా ఫుల్ స్టైలిష్ యాక్షన్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈగల్ చిత్ర నిర్మాత TG విశ్వప్రసాద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈగల్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈగల్ సినిమా చివరి 40 నిముషాలు అదిరిపోతుంది. ఆ రేంజ్ అస్సలు ఎవరూ ఊహించరు. బాహుబలి లో క్లైమాక్స్ ఎంత బాగుంటుందో దాంతో కంపేర్ చేయకపోయినా లోకేష్ కనగరాజ్ స్టైల్ లో హై లెవెల్ యాక్షన్ లా ఉంటుంది. క్లైమాక్స్ చూసి అంతా ఆశ్చర్యపోతారు. తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ క్వాలిటీతో సినిమా తీసాము అని తెలిపారు.
దీంతో ఈగల్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్.. ఇలా పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
#LokeshKanagaraj: Not exaggerating, last 40 minutes of #Eagle is explosive. @vishwaprasadtg with M9 News. pic.twitter.com/w6YjjWZljW
— M9 NEWS (@M9News_) February 7, 2024
Also Read : Kumari Aunty : స్టార్ మా స్పెషల్ ఈవెంట్ కు ‘కుమారి ఆంటీ ‘ స్పెషల్ గెస్ట్..