Raviteja Eagle First Review మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో అనుపమ, కావ్య తాపర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు దేవ్ జాండ్ మ్యూజిక్ అందించారు. సోనీ కంపెనీలో వీడియో గేమ్స్ కు మ్యూజిక్ అందించిన దేవ్ జాండ్ ఈగల్ కు ప్రత్యేకమైన సంగీతాన్ని అందించాడు.
ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న ఈగల్ సినిమా కు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ రివ్యూ ఇచ్చింది ఏ రివ్యూయరో.. ఏ సెన్సార్ మెంబరో కాదు స్వయానా ఈగల్ హీరో రవితేజానే. అవును సినిమా మొత్తం విత్ సౌండ్ మిక్సింగ్ అయ్యాక సినిమాను ఇప్పటివరకు చూడని రవితేజ ఫైనల్ గా సినిమా చూసి సూపర్ సాటిస్ఫైడ్ అని అన్నారు.
సినిమాను చిత్ర యూనిట్ కోసమే స్పెషల్ ప్రీమియర్ వేయగా సినిమా చూసిన అనంతరం రవితేజ సూపర్ సాటిస్ఫైడ్ అనే కామెంట్ చేశారట. సో అలా రవితేజ ఈగల్ రివ్యూ బయటకు వచ్చింది. ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న రవితేజ క్రాక్ తర్వాత మళ్లీ గాడి తప్పాడు. వాల్తేరు వీరయ్య హిట్ అయినా అది మల్టీస్టారర్ కాబట్టి రవితేజ ఖాతాలోకి రాలేదు.
అందుకే ఈగల్ తో మరోసారి హిట్ కిక్ చూడాలని చూస్తున్నారు రవితేజ. ఈగల్ సినిమా ట్రైలర్ కూడా ఇంపాక్ట్ బాగానే క్రియేట్ చేసినా అసలు కథ రివీల్ చేయకుండా సినిమా థియేటర్ లో ఆడియన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
Also Read : Manchu Vishnu Kannappa : మంచు విష్ణు కన్నప్ప ప్లాన్ పెద్దదే.. సినిమా హైలెట్స్ గా ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..!