Raviteja : బాలీవుడ్ షోలో చేతిపై బీర్ బాటిల్ పగలగొట్టుకున్న రవితేజ..

ప్రస్తుతం రవితేజ పాన్ ఇండియా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్(Bollywood) లో కూడా టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Raviteja Break Beer Bottle on his Hand in Bollywood TV Show

Raviteja Break Beer Bottle on his Hand in Bollywood TV Show

మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈసారి దసరాకి టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్యపాత్ర పోషించింది.

ప్రస్తుతం రవితేజ పాన్ ఇండియా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్(Bollywood) లో కూడా టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో పలు ఇంటర్వ్యూ లు ఇస్తూ, పలు టీవీ షోలకు, ప్రెస్ మీట్స్ కి హాజరవుతున్నారు రవితేజ. ఇటీవల బాలీవుడ్ లో వచ్చే ఇండియాస్ గాట్ ట్యాలెంట్ అనే షోకి వెళ్ళాడు రవితేజ.

రవితేజ ఇద్దరి హీరోయిన్స్ తో కలిసి ఆ షోలో ఎంట్రీ ఇచ్చి డ్యాన్స్ తో అదరగొట్టాడు. ఆ షోలో జడ్జిగా ఉన్న శిల్పాశెట్టితో కూడా డ్యాన్స్ వేసి అలరించాడు. అయితే ఆ షోలో రవితేజ బీర్ బాటిల్స్ ని తన చేతిమీద పగలగొట్టుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజగా ఈ షో ప్రోమో విడుదలవ్వగా రవితేజ చేతిపై బీర్ బాటిల్ పగలగొట్టుకోవడం చుసిన అభిమానులు, నెటిజన్లు షాక్ అయ్యారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Also Read : SDT 17 : సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ సినిమా అనౌన్స్.. గాంజా శంకర్..

  Last Updated: 15 Oct 2023, 10:02 AM IST