Site icon HashtagU Telugu

Rush : చాన్నాళ్లకు ‘రష్’ అంటూ వచ్చిన రవిబాబు.. ఓటీటీలో దూసుకుపోతున్న రవిబాబు సినిమా..

Ravibabu Rush Movie Streaming in ETV Win OTT

Ravibabu Rush Movie Streaming in ETV Win OTT

Rush : ఓ పక్క డైరెక్టర్ గా మంచి మంచి సినిమాలు తీస్తూనే నటుడిగా కూడా ఫుల్ బిజీగా ఉండేవాడు రవిబాబు(Ravibabu). అల్లరి, నచ్చావులే,మనసారా, అమరావతి, అనసూయ, అవును.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు డైరెక్టర్ రవిబాబు. కానీ గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన రవిబాబు తాజాగా మరో సినిమాతో వచ్చాడు.

అయితే ఈసారి రవిబాబు దర్శకుడిగా కాకుండా నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తూ, కథ – స్క్రీన్ ప్లే అందించి ఒక సినిమా తీశారు. రవిబాబు ఆధ్వర్యంలో సతీశ్ పోలోజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రష్’. నటి డైసీ బోపన్న ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఒక సాధారణ గృహిణికి అనుకోకుండా కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే తన కూతురు కోసం ఆ గృహిణి ఏం చేసింది అని యాక్షన్ థ్రిల్లర్ గా రష్ సినిమాని తెరకెక్కించారు.

ఈ రష్ సినిమా ప్రస్తుతం ‘ఈటీవీ విన్`లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో ఓ సామాజిక సమస్య గురించి కూడా చూపించారు రవిబాబు. చాలా రోజుల తర్వాత రవిబాబు నుంచి సినిమా రావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ రష్ సినిమా ప్రస్తుతం ఈటీవి విన్‌లో దూసుకుపోతుంది.

 

Also Read : Minister Kandula Durgesh : మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన మంత్రి కందుల దుర్గేష్