Tiger Nageswara Rao : చిక్కుల్లో టైగర్ నాగేశ్వరరావు..ధైర్యం చేసి షూటింగ్ చేస్తున్నారు

స్టువర్టుపురం ప్రజలను అవమానించేలా ఉందని కోర్టు భావించింది సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్ లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని

  • Written By:
  • Publish Date - August 31, 2023 / 02:16 PM IST

మాస్ రాజా రవితేజ (Raviteja)..ప్రస్తుతం హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెడుతూ వస్తున్నాడు. రీసెంట్ గా ధమాకా (Dhamaka),వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ..ఆ తర్వాత రావణాసుర (Ravanasuraa) తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. అయినప్పటికీ రవితేజ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం వంశీ (Vamsee) డైరెక్షన్లో టైగర్‌ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) మూవీ చేస్తున్నాడు. 1970 కాలంలో స్టూవర్ట్‌పురం (stuartpuram )లో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్‌ రావు (Tiger nageswara rao) జీవిత కథ నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్‌ సనన్‌ టాలీవుడ్‌ డెబ్యూ ఇస్తోంది.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్‌ ఖేర్ (Anupam Kher) ‌, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా నటిస్తున్నాడు. మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చూస్తున్నారు.

Read Also : Yuvagalam : నారా లోకేష్ ‘యువగళం కాదు ఇది ప్రజాగళం’

ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ మూవీ (Tiger Nageswara Rao Teaser) టీజర్ విడుదల చేయగా..అది కాస్త వివాదాస్పదం అయ్యింది. ఈ మూవీ స్టువర్టుపురం లోనే ఎరుకల సామాజిక వర్గ మనోభావాలను కించపరిచేలా ఉందని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని చుక్క పాల్ రాజ్ అనే వ్యక్తి హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. పిటిషనర్ తరపున పృథ్వీరాజ్, కార్తీక్ అనే న్యాయవాదులు బలమైన వాదించారు. దీంతో న్యాయమూర్తులు స్పందించారు. టీజర్ లో వాడిన పదప్రయోగం ఓ సామాజిక వర్గాన్ని, స్టువర్టుపురం ప్రజలను అవమానించేలా ఉందని కోర్టు భావించింది సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్ లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సమాజం పట్ల బాధ్యత ఉండాలని.. ఇలాంటి టీజర్ వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించింది.

Read Also : Raksha Bandhan : ఆ 60 గ్రామాలు ‘రక్షా బంధన్’ కు దూరం..ఎందుకో తెలుసా..?

ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ను కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కు సూచించింది. ఈ కేసు విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. అభ్యంతరాలపై ముంబై సెంట్రల్ బోర్డుకి చెందిన చైర్పర్సన్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ప్రస్తుతం అయితే మేకర్స్ ఇవన్నీ పట్టించుకోకుండా ఈ సినిమా చిత్రీకరణను శరవేగంగా జరుపుతున్నారు. మరి కోర్ట్ తీర్పు ఎలా వస్తుందో చూడాలి. పెద్ద హీరోల సినిమాలు వస్తున్నప్పుడు ఇలాంటి వివాదాలు కామనే. ఇప్పటివరకు ఇలా ఎన్నో సినిమాలకు వివాదాలు అంటుకున్నాయి. ఇప్పుడు కూడా అదే మాదిరి.