Mahadhan : అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తబోతున్న రవితేజ కొడుకు..

Mahadhan Bhupatiraju : మహాధన్‌ కి దర్శకత్వం పై ఉన్న ఆసక్తితో పాటు, దర్శకుడు సందీప్‌ వంగ పై విపరీతమైన అభిమానం ఉందట

Published By: HashtagU Telugu Desk
Ravitejason

Ravitejason

చిత్రసీమ (Film Industry )లో హీరోలు కొడుకులు హీరోలుగా..నిర్మాతల తనయులు హీరోలు గా , నిర్మాతలు గా , హీరోయిన్ల కుమార్తెలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే..మాస్ రాజా రవితేజ (Raviteja) తనయుడు మహాధన్ (Mahadhan Bhupatiraju) మాత్రం హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అది కూడా మాస్ , క్రేజ్ డైరెక్టర్ వద్ద. చిత్రసీమలోకి రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసి..ఆ తర్వాత సైడ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్నాడు..ఆలా పలు సినిమాలు చేసిన రవితేజ..పూరి డైరెక్షన్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీ చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఇలా హ్యాట్రిక్ కొట్టి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏడాది రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ దూసుకెలుతున్నాడు.

రవితేజ కు ఒక పాప, ఒక బాబు అనే విషయం తెల్సిందే. బాబు మహాధన్ ఇప్పటికే ఒక సినిమాలో నటుడిగా కనిపించాడు. దీంతో అంత అతడు హీరో అవుతాడని ఫిక్స్ అయ్యారు. కానీ మహాధన్ మాత్రం డైరెక్షన్లో రాణించాలని ఫిక్స్ అయ్యాడు. మహాధన్‌ కి దర్శకత్వం పై ఉన్న ఆసక్తితో పాటు, దర్శకుడు సందీప్‌ వంగ (Sandeep Vangaa) పై విపరీతమైన అభిమానం ఉందట. అందుకే గత కొన్నాళ్లుగా సందీప్‌ వంగ వద్ద మహాధన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్ గా వర్క్‌ చేస్తున్నాడట. స్క్రిప్ట్‌ వర్క్‌ తో పాటు, అన్ని విషయాలపైనా పట్టు కోసం మహాధన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. 20 ఏళ్ల మహాధన్‌ త్వరలోనే దర్శకుడిగా ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట. మరి మహాధన్‌ కు ఫస్ట్ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి.

Read Also : PM Modi : మరోసారి బీజేపీ సర్కార్‌..హర్యానా ప్రజానీకం చెబుతుంది: ప్రధాని మోడీ

  Last Updated: 25 Sep 2024, 05:29 PM IST