Site icon HashtagU Telugu

Vishal : జగన్‌పై జరిగిన రాయి దాడిపై.. హీరో విశాల్ ఏమన్నారంటే..

Ys Jagan Vishal

Ys Jagan Vishal

Vishal : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తెలుగు పాలిటిక్స్ పై కామెంట్స్ చేస్తూ ఇక్కడ వైరల్ అవుతుంటారు. గతంలో ఇక్కడ నాయకులు గురించి మాట్లాడుతూ.. “నటుడిగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, లీడర్ గా జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రేమ” చేసిన కామెంట్స్ అప్పటిలో బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు, నెక్స్ట్ కూడా జగనే సీఎం అవుతారని ఆయన పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది.

మరో నెల రోజుల్లో ఏపీలో ఎన్నికల జరగబోతున్నాయి. ఈ సమయంలో విశాల్ మరోసారి ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడారు. ఇటీవల జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై విశాల్ కామెంట్స్ ని అడగగా, ఆయన మాట్లాడుతూ.. “జగన్ గారి పై ఎటాక్ అన్నది కొత్తది కాదు. ఇంతముందుకు ఎయిర్ పోర్టులో కోడి కత్తితో కూడా దాడి చేసారు. ఆల్మోస్ట్ ప్రాణాలు పోయాయి. అంతేకాదు ఆయన ఫ్యామిలీలోనే ఎన్నో ప్రమాదాలను చూసారు. ఇలాంటివి అన్ని చూసిన వ్యక్తి ఇలాంటి దాడులకు భయపడరు. పైగా ఆయన రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి” అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే పవన్ కాకుండా జగన్ ని సపోర్ట్ చేయడం వెనుక ఉన్న రీసన్ ఏంటని ప్రశ్నించగా, విశాల్ బదులిస్తూ.. “కాలేజీలో చాలామంది అమ్మాయిలు ఉంటారు. వారిలో ఎంతోమంది అందమైన అమ్మాయిలు ఉంటారు. కానీ మనం వారందర్ని ప్రేమించలేము కదా. ఒకరినే ప్రేమిస్తాము. అలా నేను జగన్ గారిని ప్రేమిస్తున్నాను. అండ్ అలాగే నేను కేవలం జగన్ గారి అభిమానాన్ని మాత్రమే, వైసీపీ అభిమానిని కాదు” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మరోసారి జగన్ విజయం గురించి మాట్లాడుతూ.. ఈసారి కూడా జగన్ గారే సీఎం అవుతారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Pawan Kalyan Pedana : పెడన సభలో మత్స్యకారులకు కీలక హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్