Site icon HashtagU Telugu

Kingdom : మనం కొట్టినం విజయ్ – రష్మిక ట్వీట్

Vijay Rashmika Kingdom

Vijay Rashmika Kingdom

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన ‘కింగ్డమ్’ (Kingdom ) చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ‘జర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, సత్యదేవ్ ఒక కీలక పాత్రలో కనిపించారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్‌కి ఈ చిత్రం కొండంత ఆశలు నింపింది. కేవలం విజయ్కి మాత్రమే కాదు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత సహా చిత్ర బృందం మొత్తం ఈ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను ఈ చిత్రం నిజం చేసిందని చెప్పాలి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ స్పందన ఇవ్వడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది.

Almond Tea : టీ, కాఫీకి బదులు బాదం టీ.. ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు!

‘కింగ్డమ్’ సినిమా విజయంతో చిత్ర బృందం సంతోషంగా ఉండగా, ఈ ఆనందంలో హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika) కూడా పాలుపంచుకున్నారు. విజయ్ దేవరకొండకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ రష్మిక ఒక ట్వీట్ చేశారు. “ఈ విజయం నీకు, అలాగే నిన్ను ప్రేమించిన వారందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. మనం కొట్టినం” అని ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. రష్మిక చేసిన ఈ ట్వీట్ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. రష్మిక ట్వీట్‌కు విజయ్ సైతం అంతే ఆనందంగా స్పందించారు. “మనం కొట్టినం” అంటూ రష్మిక ట్వీట్‌కు రీట్వీట్ చేశారు. వీరిద్దరి మధ్య ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ హ్యాపీ మూమెంట్ చూసి అభిమానులు మరింత ఉత్సాహంగా మారి, “మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేయండి” అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండకు ఒక భారీ విజయం దక్కడం, దానికి రష్మిక నుండి వచ్చిన ప్రత్యేక అభినందనలు వారి అభిమానులకు మరింత ఆనందాన్నిచ్చాయి.