Site icon HashtagU Telugu

Rashmika : సమంత ప్లేస్ లో రష్మిక.. గోల్డెన్ ఛాన్స్..!

Why Rashmika skip 100 Crores Movie

Why Rashmika skip 100 Crores Movie

Rashmika స్టార్ హీరోయిన్ సమంత హెల్త్ ఇష్యూస్ వల్ల తన దాకా వచ్చిన ఛాన్స్ లను కూడా మిస్ అవుతూ వస్తుంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన సమంత ఆ సినిమాలో కూడా కొంత పార్ట్ ఒకలా మరికొంత పార్ట్ మరోలా కనిపించింది. ఖుషి తర్వాత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని చూస్తుంది సమంత. ఇక ఇదిలాఉంటే ఒక క్రేజీ సినిమాలో ముందు సంతని హీరోయిన్ గా అనుకోగా ఇప్పుడు ఆమెని కాదని రష్మికకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇంతకీ సమంత ని కాదని రష్మిక (Rashmika)ని తీసుకున్న ప్రాజెక్ట్ ఏది అంటే అది రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో సినిమా అని తెలుస్తుంది. చిలసౌ తో హిట్ అందుకున్న రాహుల్ నాగార్జునతో మన్మథుడు 2 చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ కాగా మరో చాన్స్ అందుకోలేదు. లేటెస్ట్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రాహుల్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో మొదట సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు.

కానీ సమంత తో సినిమా అంటే ఇప్పుడు కష్టమని భావిస్తున్నారు. ఆమె అన్ హెల్తీ నెస్ సినిమాకు ఇబ్బందిగా మారుతుంది. అయితే సమంత కాదనుకుని ఆమె ప్లేస్ లో రష్మికని తీసుకోవాలని అనుకుంటున్నారు. తెలుగులో ఒక మంచి అవకాశం కోసం చూస్తున్న రష్మిక ఈ ఛాన్స్ తో మళ్లీ తిరిగి ఫాం లోకి రానుంది. సమంత బదులుగా రష్మిక చేస్తున్న ఈ సినిమా అమ్మడికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఓ పక్క బాలీవుడ్ లో సినిమాలు చేసినా అవి సరిగా వర్క్ అవుట్ కాకపోవడంతో తెలుగులో సినిమాల మీదే దృష్టి పెట్టాలని అనుకుంటుంది రష్మిక. గీతా ఆర్ట్స్ 2 బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు కాబట్టి కచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read : Bigg Boss 7 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందా లేదా..?

Exit mobile version